తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆశల పల్లకిలో మదుపర్లు.. లాభాల్లో సూచీలు

స్టాక్ ​మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 125 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 39 వేల 560 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 11వేల800 మార్కు ఎగువకు చేరింది.

విద్యుత్తు రంగంలో కొనుగోళ్లు.. లాభాల్లో స్టాక్​మార్కెట్లు

By

Published : Jun 26, 2019, 9:58 AM IST

Updated : Jun 26, 2019, 10:28 AM IST

ఆటో, విద్యుత్, ఇన్​ఫ్రా, ఫార్మా రంగాల షేర్ల కొనుగోళ్లతో స్టాక్​మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. భారీ విదేశీ నిధుల ప్రవాహం మధ్య.. ఐసీఐసీఐ బ్యాంక్​, ఎల్​ అండ్​ టీ, ఆర్​ఐఎల్​లు లాభాల్లోకి వచ్చాయి. వచ్చే వారం వార్షిక బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న తరుణంలో.. వృద్ధి అంచనాలతో మదుపర్లు ఉత్సాహంగా కొనుగోళ్లు జరుపుతున్నారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 125 పాయింట్ల లాభంలో ఉంది. ప్రస్తుతం 39వేల 560 వద్ద కొనసాగుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ స్వల్ప లాభం నమోదు చేసింది. ఆరంభ ట్రేడింగ్​లో ఫ్లాట్​గా ట్రేడయిన నిఫ్టీ.. అనంతరం 11వేల 800 మార్కును దాటింది. ప్రసుతం 30 పాయింట్ల వృద్ధితో 11 వేల 826 వద్ద ఉంది.

అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్లు మళ్లీ తగ్గిస్తామన్న సంకేతాలూ.. దేశీయ మార్కెట్ల లాభాలకు మరో కారణం.

ఎన్టీపీసీ, పవర్​గ్రిడ్​కు భారీ లాభాలు..

సెన్సెక్స్​ 30 షేర్లలో పవర్​గ్రిడ్​, ఎన్టీపీసీ, సన్​ ఫార్మా భారీ లాభాలను నమోదు చేశాయి. ఎల్​ అండ్​ టీ, ఐసీఐసీఐ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, టాటా మోటార్స్​, వేదాంత 2 శాతానికి పైగా లాభాలు పొందాయి.

టాటా స్టీల్​, బజాజ్​ ఫినాన్స్​, హెచ్​యూఎల్​, టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​ నష్టాల జాబితాలో ఉన్నాయి.

రూపాయి 10 పైసలు పతనం..

ఆరంభ ట్రేడింగ్​లో రూపాయి బలహీనపడింది. 10 పైసలు క్షీణించింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 69. 46 వద్ద ఉంది.

ముడిచమురు ధరలు బుధవారం.. ఒక శాతం మేర పెరిగాయి. ఇప్పటికే అమెరికా-ఇరాన్​ వాణిజ్య యుద్ధం ఆందోళనలతో బలహీనంగా మారిన మార్కెట్లపై ఇది ప్రతికూల ప్రభావం చూపనుంది.

Last Updated : Jun 26, 2019, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details