స్టాక్ మార్కెట్లు ఇటీవలి వరుస లాభాలకు బ్రేక్ చెబుతూ నేడు భారీ నష్టాలతో ముగిశాయి. ఆరంభమే నష్టాలను నమోదు చేసిన సూచీలు ఏ దశలోను కోలుకోలేదు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 2,002 పాయింట్లు కోల్పోయి 31,715 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 566 పాయింట్ల నష్టంతో 9,293వద్దకు చేరింది.
భారీ నష్టాలతో సెషన్ ఆరంభంలోనే బీఎస్ఈ మదుపరుల సంపద రూ.5.15 లక్షల కోట్లు ఆవిరైంది.
నష్టాలకు కారణాలు..
దేశవ్యాప్త లాక్డౌన్ పొడిగింపు, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నష్టాలకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు చైనాపై ఆగ్రహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ..ఆ దేశంపై సుంకాల మోత తప్పదని హెచ్చరించారు. ఈ ప్రతికూలతలన్నింటి నేపథ్యంలో ఇటీవల నమోదైన లాభాలను మదుపరులు సొమ్ముచేసుకునే పనిలో పడ్డారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతుండటం కూడా మదుపరుల సెంటిమెంట్ దెబ్బతిసినట్లు అభిప్రాయపడుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ నేడు 32,748 వద్ద సెషన్ ప్రారంభించింది (నేటి గరిష్ఠ స్థాయి కుడా ఇదే). 31,692 పాయింట్ల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది.