తెలంగాణ

telangana

ETV Bharat / business

టీకా జోష్​- మార్కెట్ల ఆల్​టైమ్​ రికార్డ్​

స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నాయి. వరుసగా పదో సెషన్​లోనూ లాభాలను నమోదు చేశాయి సూచీలు. సెన్సెక్స్ 261 పాయింట్లు పెరిగి తొలిసారి 48,400 మార్క్​ దాటింది. నిఫ్టీ కూడా 67 పాయింట్ల లాభంతో 14,200కి చేరువలో ముగిసింది. బ్యాంకింగ్, ఐటీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

STOCKS CLOSE AT NEW RECORD LEVEL
స్టాక్ మార్కెట్ల దూకుడు

By

Published : Jan 5, 2021, 3:47 PM IST

స్టాక్ మార్కెట్లు గత కొన్ని రోజులుగా టాప్ స్పీడ్​లో దూసుకుపోతున్నాయి. మంగళవారం సెషన్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్ 261 పాయింట్లు బలపడి జీవనకాల గరిష్ఠమైన 48,438 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి సరికొత్త రికార్డు స్థాయి అయిన 14,199 వద్ద స్థిరపడింది. మిడ్​ సెషన్​ ముందు సూచీలు కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్నా.. చివరకు రికార్డు స్థాయిల వద్ద ముగియటం విశేషం. మార్కెట్లు లాభాలను నమోదు చేయడం వరుసగా ఇది పదో సెషన్​.

కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సన్నాహాలు జరుగతున్న తరుణంలో మదుపరుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఈ నేపథ్యంలో నమోదైన కొనుగోళ్ల మద్దతు లాభాలకు దన్నుగా నిలిచినట్లు తెలుస్తోంది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 48,486 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 47,903 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 14,215 పాయింట్ల గరిష్ఠ స్థాయి(జీవనకాల గరిష్ఠం), 14,048 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

యాక్సిస్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, ఇండస్​ఇండ్ బ్యాంక్, టీసీఎస్​, ఏషియన్ పెయింట్స్, టైటాన్​ షేర్లు ప్రధానంగా లాభాపడ్డాయి.

ఓఎన్​జీసీ, బజాజ్ ఫినాన్స్, ఎన్​టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎం&ఎం, బజాజ్ ఆటో షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన స్టాక్ మార్కెట్లు అయిన షాంఘై, సియోల్, హాంకాంగ్ సూచీలు మంగళవారం లాభపడ్డాయి. టోక్యో సూచీ మాత్రం నష్టాలను మూటగట్టుకుంది.

ఇదీ చూడండి:అదిరే ఫీచర్లతో షావోమి ఎమ్​ఐ11 ప్రొ!

ABOUT THE AUTHOR

...view details