తెలంగాణ

telangana

ETV Bharat / business

రుణాలపై వడ్డీరేట్లు మరింత తగ్గించిన స్టేట్​ బ్యాంక్​

భారతీయ స్టేట్​ బ్యాంకు మరోమారు వడ్డీ రేట్లు తగ్గించింది. రెపో రేటుకు లింక్​ కాని రుణాలపై ఎమ్​సీఎల్​ఆర్​ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త రేట్లు రేపటి నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.

రుణాలపై వడ్డీరేట్లు మరింత తగ్గించిన స్టేట్​ బ్యాంక్​

By

Published : Oct 9, 2019, 12:34 PM IST

అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్​... ఎస్​బీఐ మరోమారు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించింది. ఎమ్​సీఎల్​ఆర్​ను 10 బేసిస్​ పాయింట్లు తగ్గించినట్లు ప్రకటించింది.

ఫలితంగా ఇప్పటివరకు 8.15 శాతంగా ఉన్న ఎమ్​సీఎల్​ఆర్​... తాజా తగ్గింపుతో 8.05 శాతానికి చేరింది. కొత్త రేట్లు గురువారం నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది భారతీయ స్టేట్ బ్యాంక్. రెపోతో అనుసంధానమైన రుణాలకు ఈ తగ్గింపు వర్తించదని పేర్కొంది.

ఎస్​బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ రేట్లు తగ్గించడం ఇది ఆరోసారి.

" పండుగల సీజన్​ను దృష్టిలో ఉంచుకొని అన్ని విభాగాలలోని వినియోగదారులకు ప్రయోజనాలను విస్తరించడానికి ఎంసీఎల్​ఆర్​ను 10 బేసిస్​ పాయింట్లు తగ్గించాం."

- ఎస్​బీఐ

గత వారం రెపోరేటును 25 బేసిస్​ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు.. రెపోరేటుకు అనుగుణంగా వడ్డీ రేట్లు సవరించాలని ఆర్​బీఐ కోరింది.

ఇదీ చూడండి: పన్ను మదింపు ఇక ఆన్​లైన్​లో చేసుకోవచ్చు..

ABOUT THE AUTHOR

...view details