తెలంగాణ

telangana

ETV Bharat / business

సముద్రంలో అతిపెద్ద కేబుల్​ వ్యవస్థ: జియో

భారత్​ కేంద్రంగా అతిపెద్ద అంతర్జాతీయ జలాంతర్గ కేబుల్​ వ్యవస్థలను నిర్మిస్తున్నట్లు టెలికాం ఆపరేటర్​ రిలయన్స్​ జియో తెలిపింది. ఈ ప్రాజెక్టును ప్రపంచ భాగస్వాములు, సముద్రం లోపల కేబుల్​ సరఫరాదారు సబ్​కామ్​తో కలిసి చేస్తున్నట్లు వివరించింది.

Reliance Jio
సముద్రంలో అతిపెద్ద కేబుల్​ వ్యవస్థల నిర్మాణం: జియో

By

Published : May 18, 2021, 8:24 AM IST

పెరిగిన డేటా గిరాకీని తీర్చేందుకు అనువుగా ప్రపంచ భాగస్వాములు, సముద్రం లోపల కేబుల్​ సరఫరాదారు సబ్​కామ్​తో కలిసి భారత్​ కేంద్రంగా అతిపెద్ద అంతర్జాతీయ జలాంతర్గ కేబుల్​ వ్యవస్థలను నిర్మిస్తున్నట్లు టెలికాం ఆపరేటర్​ రిలయన్స్​ జియో సోమవారం వెల్లడించింది.

కంపెనీ నిర్మించబోతున్న ఈ రెండు జలాంతర్గ కేబుల్ వ్వవస్థల్లో ఒకటి భారత్​ను సింగపూర్​, థాయ్​లాండ్​, మలేషియాల ద్వారా ఆసియా పసిఫిక్ విపణితో, రెండోది ఇటలీ, మధ్య, ఉత్తరాఫ్రికా ప్రాంతాలతో కలుపుతుందని తెలుస్తోంది.

స్ట్రీమింగ్​ వీడియో, రిమోట్​ వర్క్​ఫోర్స్​, 5జీ, ఇంటర్నెట్​ ఆఫ్​ థింగ్స్​(ఐఓటీ) తదితర సేవల గిరాకీని అందుకోవడానికి వీలుగా భారత్​ కేంద్రంగా ఐఏఎక్స్​ జలాంతర్గామి వ్యవస్థల్ని తొలిసారిగా నిర్మిస్తున్నామని రిలయన్స్​ జియో ప్రెసిడెంట్​ మాథ్యూ ఊమెన్​ వెల్లడించారు.

ఇదీ చూడండి:అయిదోతరం సాంకేతిక సమరం షురూ

ABOUT THE AUTHOR

...view details