ఈ ఏడాది మార్చి నుంచి పాత రూ.100 కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోనున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) అధికారులు తెలిపారు. కొత్త రూ.100 నోట్లు మాత్రమే చలామణిలో ఉంచేందుకే ఈ చర్యకు ఉపక్రమించనున్నట్లు ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మహేశ్.. వెల్లడించారు.
రూ.100 నోట్ల ఉపసంహరణ.. ఎప్పటినుంచో తెలుసా? - old rs 100 note withdraw news updates
మార్చి నుంచి పాత రూ.100 నోట్లను ఉపసంహరించుకోనున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. అయితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. కొత్త రూ.100 నోట్లు మాత్రమే చలామణిలో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
రూ.100 నోట్ల ఉపసంహరణ.. ఎప్పుడంటే?
కర్ణాటక మంగుళూరులో నిర్వహించిన బ్యాంకుల భద్రత నగదు నిర్వహణ సమావేశంలో మాట్లాడిన మహేశ్.. పాత రూ.100 నోటుల్లో నకిలీ నోట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. అందుకే పాత సిరీస్ను(మహాత్మా గాంధీ సిరీస్) ఉపసంహరించుకోనున్నట్లు తెలిపారు. ఆర్బీఐ గత ఆరు నెలలుగా పాత రూ.100 నోట్లు ప్రింటింగ్ నిలిపివేసిందన్న ఆయన.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
ఇదీ చూడండి:ఎలాన్ మస్క్ రూ.730 కోట్ల బహుమతి- ఎవరికంటే?