దేశంలో పెట్రోల్ ధరలు గురువారం ఆల్టైమ్ రికార్డు సృష్టించాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 23పైసలు పెరిగి.. రూ. 84.20కు చేరుకుంది. రాష్ట్రాల ఆధారిత ఇంధన రిటైలర్లు పెట్రోల్ రేట్లను వరుసగా రెండో రోజూ పెంచడమే ఇందుకు కారణం.
దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర బుధవారం 26 పైసలు పెరిగి.. రూ.83.97 వద్దకు చేరింది. 2018 అక్టోబర్ 4న పెట్రోల్ ధర లీటర్ రూ.84 వద్దకు చేరి జీవనకాల రికార్డ్ స్థాయిని తాకింది.