వరుసగా ఐదో రోజు చమురు ధరలు పెరిగాయి. ఈ నెలలోనే ధరల పెరగటం ఇది ఏడోసారి. పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు 39 పైసల వరకు పెంచాయి చమురు సంస్థలు.
దిల్లీలో లీటరు పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 36 పైసలు పెరిగింది. ప్రస్తుతం దిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 88.44, డీజిల్ రూ. 78.74కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోలు రూ. 94.93, డీజిల్ రూ. 85.70కు చేరింది.