OPEC Meeting: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో చమురు ధరల్లో భారీగా పెరుగుదలను నిలువరించేందుకు పరిస్ధితిని చక్కదిద్దేందుకు పెట్రోలియం ఉత్పత్తి, ఎగుమతి దేశాల సంస్ధ ఒపెక్ సిద్ధమైంది. డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించింది. 2022 ఏప్రిల్‌లో చమురు ఉత్పత్తిని రోజుకు 4లక్షల బ్యారెళ్లకు పెంచడానికి సౌదీ అరేబియా నేతృత్వంలోని ఒపెక్, దాని అనుబంధ దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు బుధవారం వర్చువల్‌గా సమావేశమై నిర్ణయం తీసుకున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఆంక్షల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ తగ్గగా.. ఒపెక్, దాని అనుబంధ దేశాలు 2021 జులై నుంచి ప్రతి నెల ఉత్పత్తిని క్రమంగా తగ్గించాయి. ప్రస్తుతం వైరస్ ఉద్ధృతి తగ్గి ఆంక్షలను సడలించిన నేపథ్యంలో డిమాండ్ భారీగా పెరిగింది. కానీ ఉత్పత్తి ఇంతకుముందు స్ధాయిలో లేదు. దీంతో ఒపెక్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. బ్యారెల్ చమురు ధర బుధవారం 110 డాలర్లకు చేరింది.