తెలంగాణ

telangana

ETV Bharat / business

ఓటీపీతో పోస్ట్​పెయిడ్​ నుంచి ప్రీపెయిడ్​కు

ఓటీపీతోనే మొబైల్ కనెక్షన్​ను పోస్ట్​పెయిడ్​ నుంచి ప్రీపెయిడ్​కు లేదా ప్రీపెయిడ్​ నుంచి పోస్ట్​పెయిడ్​కు మారే అవకాశం త్వరలోనే రానుంది. దానికోసం సిమ్​కార్డును మార్చే అవసరం ఉండదని టెలికాం విభాగం తెలిపింది.

switch from postpaid to prepaid and vice versa using OTP
ఓటీపీతో పోస్ట్​పెయిడ్​ నుంచి ప్రీపెయిడ్

By

Published : May 25, 2021, 5:11 AM IST

మొబైల్‌ ఫోన్‌ వినియోగదార్లకు నిజంగా ఇది శుభవార్తే. పోస్ట్‌పెయిడ్‌ కనెక్షన్‌ నుంచి ప్రీపెయిడ్‌ కనెక్షన్‌కు మారాలన్నా.. ప్రీపెయిడ్‌ కనెక్షన్‌ నుంచి పోస్ట్‌ పెయిడ్‌ కనెక్షన్‌కు మారాలన్నా.. కేవలం మొబైల్‌కు పంపే ఓటీపీ ఆధారిత అనుమతితో వీలు కానుంది. సిమ్‌ కార్డు మార్చాల్సిన అవసరం ఉండదు. ఆ మేరకు టెలికాం విభాగం(డాట్‌) ఒక అధికారిక నోట్‌లో పేర్కొంది. ప్రతిపాదిత వ్యవస్థను డాట్‌కు సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(కాయ్‌) నివేదించగా.. ఆపరేటర్లు ఈ ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌(పీఓసీ)కు సిద్ధమవ్వాలని డాట్‌ కోరింది.

ఈ ప్రక్రియ అమలుపై తుది నిర్ణయాన్ని పీఓసీ తుది ఫలితాల మదింపు అనంతరం తీసుకుంటామని మే 21 తేదీతో జారీ చేసిన నివేదికలో డాట్‌ ఏడీజీ సురేశ్‌ కుమార్‌ వెల్లడించారు. ఇలా ఒక పద్ధతి నుంచి మరో పద్ధతికి మారేటపుడు సేవల్లో అంతరాయం 30 నిమిషాల కంటే ఎక్కువ ఉండరాదని డాట్‌ నోట్‌ తెలిపింది. ప్రస్తుతం 90 శాతానికి పైగా మొబైల్‌ వినియోగదార్లు ప్రీపెయిడ్‌ సేవలను వినియోగిసున్నారు.

ఇదీ చూడండి:క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించ‌లేదా?

ABOUT THE AUTHOR

...view details