భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిల్లీలో పలు దిగ్గజ సంస్థల సారథులతో సమావేశమయ్యారు. దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో వాణిజ్యానికి సంబంధించిన విషయాలపై చర్చించారు.
ఈ సందర్భంగా రాబోయే అధ్యక్ష ఎన్నికల గురించి మాట్లాడారు ట్రంప్.
డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు "మేం గెలిస్తే స్టాక్ మార్కెట్లు గతంలో మాదిరిగానే రాకెట్లా దూసుకెళ్తాయి. అంతకంటే ఎక్కువే కావచ్చు."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
సరైన వ్యక్తుల్ని ఎన్నుకుంటే ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుందని, లేదంటే అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు ట్రంప్. భారత్తో భారీ వాణిజ్య ఒప్పందానికి చర్చలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఒప్పందానికి ముందు కొన్ని చట్టపరమైన అడ్డంకులు దాటాల్సి ఉంటుందని చెప్పారు.
ఇదీ చదవండి: భాజపాకు షాక్- ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా 'బిహార్' తీర్మానం