తెలంగాణ

telangana

ETV Bharat / business

వృద్ధి మందగమనంతో ఒడుదొడుకుల్లో మార్కెట్లు

అంతర్జాతీయంగా విపణిలో నెలకొన్న భయాలు, వృద్ధి మందగమనంతో స్టాక్​ మార్కెట్లు ఒడుదుడుకులకు లోనవుతున్నాయి. ఆరంభంలో నష్టాలతో ప్రారంభమైన స్టాక్​ మార్కెట్లు... అనంతరం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 53 పాయింట్ల లాభంతో 36, 615 వద్ద  ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 13 పాయింట్లు పెరిగి 10,810 వద్ద కొనసాగుతోంది.

వృద్ధి మందగమనంతో ఒడుదొడుకుల్లో మార్కెట్లు

By

Published : Sep 4, 2019, 10:15 AM IST

Updated : Sep 29, 2019, 9:32 AM IST

అంతర్జాతీయ కారణాలు, వృద్ధి మందగమనం, తయారీ రంగంలో క్షీణతతో మంగళవారం నష్టాల్లో ఊగిసలాడిన స్టాక్​మార్కెట్లు నేడూ ఒత్తిడికి లోనవుతున్నాయి. ఆరంభంలో ఫ్లాట్​గా ట్రేడయిన సూచీలు ప్రస్తుతం స్వల్ప లాభాల్లోకి వెళ్లాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 53 పాయింట్లు పెరిగి 36, 615 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 13 పాయింట్ల వృద్ధితో 10, 810 వద్ద కొనసాగుతోంది.

లాభాల్లో ఉన్న షేర్లు...

ఎస్​బీఐ, డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​, భారతీ ఎయిర్​టెల్​, వేదాంత, భారతీ ఇన్​ఫ్రాటెల్​, ఇన్ఫోసిస్​లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాల్లో ఉన్న షేర్లు...

టాటా మోటార్స్​, సన్​ ఫార్మా, జీ ఎంటర్​టైన్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, టైటాన్​ కంపెనీ నష్టాలు నమోదు చేశాయి.

కోలుకున్న రూపాయి

నిన్న భారీగా పతనమైన రూపాయి.. ప్రస్తుతం స్వల్పంగా కోలుకుంది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 11 పైసలు పెరిగి.. 72.28 వద్ద ఉంది.

Last Updated : Sep 29, 2019, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details