తెలంగాణ

telangana

ETV Bharat / business

4జీ రాకతో పెరిగిన స్పీడు.. నెలకు 11జీబీ వాడేస్తున్నాం

వార్షిక మొబైల్​ బ్రాడ్​బ్యాండ్​ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్​ (ఎంబీఐటీ) నివేదికను నోకియా విడుదల చేసింది. భారతీయులు నెలకు సగటున 11 జీబీ డేటాను వినియోగిస్తున్నారని ఇందులో స్పష్టం చేసింది. చౌకైన డేటా ప్రణాళికలు, సరసమైన హ్యాండ్​సెట్​లు, 4జీ నెట్​వర్క్​ అందుబాటులో ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది.

Nokia MBiT Report
నెలకు సగటున 11జీబీ వాడేస్తున్న భారతీయులు

By

Published : Feb 27, 2020, 6:27 PM IST

Updated : Mar 2, 2020, 6:51 PM IST

భారతీయులు నెలకు సగటున 11 జీబీ డేటాను వినియోగిస్తున్నారని టెలికాం గేర్​ తయారీ సంస్థ నోకియా తెలిపింది. చౌకైన డేటా ప్రణాళికలు, సరసమైన హ్యాండ్​సెట్​లు, 4జీ నెట్​వర్క్​ అందుబాటులో ఉండటం, వీడియో సేవలకు కూడా ఆదరణ పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. ఈ మేరకు నోకియా తన వార్షిక మొబైల్​ బ్రాడ్​బ్యాండ్​ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్​ (ఎంబీఐటీ) నివేదికను విడుదల చేసింది.

2019లో భారత్​లో డేటా ట్రాఫిక్​ 47 శాతం పెరిగిందని నోకియా వెల్లడించింది. 4జీ వినియోగమే ఇందుకు కారణమని తెలిపింది.

4జీ హవా

దేశవ్యాప్తంగా వినియోగించే మొత్తం డేటా ట్రాఫిక్​లో 4జీ డేటా 96 శాతం ఉండగా.. 3జీ డేటా మాత్రం 30 శాతం నమోదు చేసింది. ప్రస్తుతం దేశంలో 4జీ వినియోగదారుల సంఖ్య 598 మిలియన్లు ఉండగా.. 3జీ వినియోగదారుల సంఖ్య 44 మిలియన్లుగా ఉంది.

2018లో 330 మిలియన్లు ఉన్న 4జీ హ్యాండ్​సెట్​ల సంఖ్య 2019లో 1.5 రెట్లు పెరిగి 501 మిలియన్లకు చేరుకుందని నివేదిక తెలిపింది. అలాగే వాయిస్ ఓవర్ ఎల్​టీఈ (వోఎల్​టీఈ) స్మార్ట్​ఫోన్ల సంఖ్య 432 మిలియన్లకు పెరిగిందని స్పష్టం చేసింది.

అగ్రదేశాలను మించి

చైనా, అమెరికా, ఫ్రాన్స్​, దక్షిణ కొరియా, జపాన్, జర్మనీ, స్పెయిన్​ దేశాల కంటే భారత్​లో డేటా వాడకం అత్యధికంగా ఉందని నోకియా ఇండియా మార్కెటింగ్ అధికారి అమిత్ మార్వా తెలిపారు.

ఆశ్చర్యం..!

ఒక జీబీ డేటాతో సాధారణంగా 200 పాటలు లేదా గంట నిడివి గల వీడియోను చూడవచ్చు. అయితే కంటెంట్​ నాణ్యతను (ఎస్​డీ, హై-డెఫినిషన్​ (హెచ్​డీ), అల్ట్రా హెచ్​డీ) అనుసరించి వినియోగించే డేటా మొత్తం తగ్గడమో, పెరగడమో జరుగుతుంది.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భారత్​లో అందుబాటులో ఉన్న బ్రాడ్​బ్యాండ్ సేవలు 47 శాతం మాత్రమే. ఇది చైనా (95 శాతం) కంటే చాలా తక్కువ. ఇతర యూరోపియన్​ దేశాలతో పోల్చితే 95-115 శాతం తక్కువ కావడం గమనార్హం. అయితే భారత్​లో ఈ బ్రాడ్​బ్యాండ్ సేవలు మరింత పెరిగితే... డేటా వినియోగం కూడా మరింత పెరుగుతుందని అమిత్ మార్వా తెలిపారు.

అతి తక్కువ ధరకే!

భారత్​లో డేటా ధరలు ప్రపంచంలోనే అత్యల్పంగా ఉన్నాయని నోకియా నివేదిక పేర్కొంది. ప్రస్తుతం భారత్​లో ఒక జీబీ డేటా రూ.7లకే లభిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఓటీటీ

ఓవర్​ ది టాప్​ (ఓటీటీ) వేదిక సంఖ్య భారత్​లో విపరీతంగా పెరిగిపోయింది. నెట్​ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్​ సహా ఇతర కంటెంట్ ప్లాట్​ఫాంలు... పోటాపోటీగా వీడియో స్ట్రీమింగ్ సేవలను తక్కువ ధరలకే అందిస్తున్నాయి. ఫలితంగా దేశంలో డేటా వినియోగం పెరుగుతోంది.

వినియోగదారులు ఈ ఓటీటీ వేదికల్లో రోజుకు సగటున 70 నిమిషాలు, సింగిల్​ సెషన్​లో అయితే సగటున 40 నిమిషాలు గడుపుతున్నారని నోకియా నివేదిక తెలిపింది. భవిష్యత్​లో 4కే/8కే వీడియోలు, ఇండస్ట్రీ 4.0 సొల్యూషన్స్​ వస్తాయని, ఫలితంగా అల్ట్రా హైస్పీడ్ వీడియోలకు డిమాండ్ పెరుగుతుందని మార్వా తెలిపారు. ఇందు కోసం భారతీయ టెలికాం ఆపరేటర్లు పెరుగుతున్న డేటా వినియోగ సమస్యను పరిష్కరించడానికి ఇతర కనెక్టివిటీ సొల్యూషన్స్​ పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.

5జీ టెక్నాలజీ

ఆగ్మెంటెడ్ రియాలిటీ, మెటీరియల్ హ్యాండ్లింగ్, లాజిస్టిక్ సహా, డిజిటల్ అడ్వాన్స్​మెంట్​... 5జీ టెక్నాలజీకి మార్గం సుగమం చేస్తాయని నోకియా నివేదిక తెలిపింది. ఇటీవల ఎయిర్​టెల్​తో కలిసి నోకియా.... భారత్​లోని సంస్థలకు ప్రైవేట్ ఎల్​టీఈ సేవలను అందిస్తోంది.

ఇదీ చూడండి:స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు

Last Updated : Mar 2, 2020, 6:51 PM IST

ABOUT THE AUTHOR

...view details