తెలంగాణ

telangana

ETV Bharat / business

'తెలివైన లాక్​డౌన్ నిష్క్రమణ వ్యూహం కావాలి'

కరోనా సంక్షోభం, లాక్​డౌన్​ల వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలంటే... తెలివైన లాక్​డౌన్ నిష్క్రమణ వ్యూహం అమలు చేయాల్సిన అవసరముందని ఎస్​బీఐ అభిప్రాయపడింది. లాక్​డౌన్ మరింత కాలం పొడిగించడం దేశ ఆర్థిక పతనానికి దారితీస్తుందని అభిప్రాయపడింది.

India needs intelligent lockdown exit strategy: SBI
భారత్​కు తెలివైన లాక్​డౌన్ నిష్క్రమణ వ్యూహం కావాలి: ఎస్​బీఐ

By

Published : May 30, 2020, 6:06 PM IST

వృద్ధి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు దేశం ఒక తెలివైన లాక్​డౌన్ నిష్క్రమణ వ్యూహం అమలుచేయాల్సిన అవసరం ఉందని ఎస్​బీఐ తన పరిశోధన నివేదికలో పేర్కొంది.

"కరోనా సంక్షోభం వేళ జీవితాలు, జీవనోపాధి గురించి చర్చ జరిగింది. ఇప్పుడు జీవితాల గురించే చర్చిస్తున్నారు. మరోసారి లాక్​డౌన్​ పొడిగిస్తే వృద్ధి పతనాన్ని ఆపలేం. అందుకే ఇప్పుడు దేశం ఒక తెలివైన లాక్​డౌన్ నిష్క్రమణ వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్నాం."

- ఎస్​బీఐ

వృద్ధి పతనం మరింతగా..

భారత ఆర్థిక వృద్ధి 2019-20లో 11 సంవత్సరాల కనిష్ఠ స్థాయికి అంటే 4.2 శాతానికి పడిపోయింది. కరోనా సంక్షోభం, వరుస లాక్​డౌన్​ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ మరింత నష్టపోయింది. ఈ జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి (జీడీపీ) 3.1 శాతానికి పడిపోయింది. ఇది గత 40 త్రైమాసికాల్లోనే అత్యంత కనిష్ఠం.

గత అనుభవాలు

గత అనుభవాలను చూసుకుంటే, ఆర్థికమాంద్యం సంభవించిన ప్రతిసారీ... తిరిగి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవడానికి కనీసం 5 నుంచి 10 ఏళ్లు పట్టింది.

వ్యవసాయ రంగం మాత్రమే..

లాక్​డౌన్​ సంక్షోభం ధాటికి మిగతా రంగాలన్నీ కుదేలవ్వగా... ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే తట్టుకొని నిలబడగలిగింది. గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం- దాని అనుబంధ రంగాల వృద్ధి 2.4 శాతం ఉంటే ... ఈ ఏడాది 4 శాతానికి పెరిగింది.

"కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్​ఓ) మునుపటి త్రైమాసికాల వృద్ధి రేటును (మూడో త్రైమాసిక ఫలితాలతో పోలిస్తే) గణనీయంగా సవరించింది. ఈ కొత్త సమాచారం చాలా అస్పష్టంగా ఉంది. సీఎస్​ఓ ఈ విషయంపై పునఃసమీక్ష చేయాల్సిన అవసరం ఉంది."

- ఎస్​బీఐ

మార్పులు గమనించలేదా?

సాధారణంగా మూడోసారి వృద్ధి అంచనాలను విడుదల చేసిన తరువాత ... మే లో త్రైమాసిక సంఖ్యలను మార్చడం ఆనవాయితీ. అయితే లాక్​డౌన్ కారణంగా నాల్గొవ త్రైమాసికంలో జరిగిన నష్టాన్ని మిగతా త్రైమాసిక ఫలితాలకు పంపిణీ అయ్యుండవచ్చు. అంటే 2019-20లో రూ.1.08 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లిందని స్పష్టం అవుతోంది.

"ఆర్థిక వ్యవస్థ నిర్మాణాత్మక మార్పులకు లోనవుతున్న విషయాన్ని సీఎస్​ఓ గ్రహించలేదా? దీనికి కేవలం సీఎస్​ఓ మాత్రమే సమాధనం ఇవ్వగలదు. అందుకే గత రెండు-మూడేళ్లలో డేటా ఎందుకు అస్థిరంగా మారిందో... ఆ కారణాలను సీఎస్​ఓ ఓ పద్ధతి ప్రకారం వివరించాలని మేం కోరుతున్నాం."

- ఎస్​బీఐ

సీఎస్ఓ ఆర్థిక వృద్ధి అంచనాలు సమర్పించడానికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన కాలపరిమితిని పెంచింది. అందువల్ల ఆగస్టులో త్రైమాసిక, వార్షిక గణాంకాల్లో గణనీయమైన మార్పులు ఉంటాయని ఎస్​బీఐ భావిస్తోంది.

ఇదీ చూడండి:తాత్కాలిక సభ్యదేశంగా భారత్​ ఎన్నిక లాంఛనమే!

ABOUT THE AUTHOR

...view details