పన్ను చెల్లింపుదారులు తమ వ్యక్తిగత ఈ-ఫైలింగ్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురికాకుండా జాగ్రత్త వహించాలని కోరింది ఆదాయపన్ను శాఖ. ఏమైనా అనుమానాస్పద చర్యలను గుర్తిస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది.
" ఒకవేళ మీ ఈ-ఫైలింగ్ ఖాతాను అక్రమంగా యాక్సెస్ చేస్తున్నట్లు అనిపిస్తే.. మీరు సైబర్ క్రైమ్ బాధితులే. అలాంటి పరిస్థితి తలెత్తితే మొదటగా సంబంధిత పోలీసులు లేదా సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయాలి. https://cybercrime.gov.in/ వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఖాతాల లాగిన్ ఐడీల వంటి వివరాలను ఇతరులతో పంచుకోవద్దు. "