ETV Bharat / business

కరోనా దెబ్బకు 19.5 కోట్ల ఉద్యోగాలు మాయం!

భారత్​లో కొవిడ్-19 ప్రభావంపై అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రమాద ఘంటికలు మోగించింది. కరోనా సంక్షోభం కారణంగా దేశంలో 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులు తీవ్రమైన పేదరికం బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 19.5 కోట్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు 'ఐఎల్ఓ మానిటర్ సెకండ్ ఎడిషన్' పేరిట నివేదిక విడుదల చేసింది.

COVID-19 crisis
కరోనా సంక్షోభం
author img

By

Published : Apr 8, 2020, 1:12 PM IST

దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ మహమ్మారి కారణంగా లెక్కలేనన్ని ఉద్యోగాలపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా సంక్షోభం వల్ల భారత్ లోని 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులు పేదరికం బారిన పడనున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) స్పష్టం చేసింది.

లాక్​డౌన్​తో పాటు కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉద్యోగాలు, ఉపాధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించనున్నట్లు ఐఎల్ఓ పేర్కొంది. ఈ మేరకు మార్చి 18న విడుదల చేసిన నివేదికకు కొనసాగింపుగా 'ఐఎల్ఓ మానిటర్ సెకండ్ ఎడిషన్: కొవిడ్-19 వరల్డ్ ఆఫ్ వర్క్'ను వెలువరించింది. కొవిడ్-19ను రెండో ప్రపంచయుద్ధం తర్వాత సంభవించిన 'అత్యంత దారుణమైన ప్రపంచ సంక్షోభం'గా అభివర్ణించింది.

"అసంఘటిత రంగంలోని లక్షలాది మంది కార్మికులపై కొవిడ్-19 ఇప్పటికే ప్రభావం చూపించింది. వైరస్ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యల ఫలితంగా భారత్, నైజీరియా, బ్రెజిల్ దేశాల్లో అసంఘటిత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతోంది. భారత్​లో 90 శాతం మంది ప్రజలు అసంఘటిత ఆర్థిక వ్యవస్థ పరిధిలో ఉన్నారు. ఇందులో 40 కోట్ల మంది కార్మికులు సంక్షోభ సమయంలో తీవ్రమైన పేదరికం బారిన పడే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు."-అంతర్జాతీయ కార్మిక సంస్థ

భారత్​లో లాక్​డౌన్​ వల్ల ఉపాధికి గండిపడిందని, వేలాది మంది సొంత గ్రామాలకు తరలివెళ్తున్నారని ఐఎల్ఓ పేర్కొంది. ఉద్యోగుల పనివేళలు, ఆదాయంపైనా విపత్కర ప్రభావం పడిందని స్పష్టం చేసింది.

19.5 కోట్ల ఉద్యోగాలు ఉఫ్!

కరోనా సంక్షోభం వల్ల 2020 రెండో త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 6.7 శాతం పనిగంటలు తుడిచిపెట్టుకుపోతాయని ఐఎల్ఓ అంచనా వేసింది. ఇది 19.5 కోట్ల ఉద్యోగుల పూర్తి స్థాయి పనిగంటలకు సమానమని తెలిపింది. అరబ్ దేశాల్లో అత్యధికంగా 8.1 శాతం, ఐరోపాలో 7.8 శాతం, ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో 7.2 శాతం పనిగంటలపై కరోనా ప్రభావం ఉంటుందని లెక్కగట్టింది. ఎగువ మధ్య తరగతి దేశాల్లోనే అధిక నష్టం సంభవిస్తుందని స్పష్టం చేసింది. 2008-09లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో పోలిస్తే ఈ ప్రభావం చాలా ఎక్కువ అని వెల్లడించింది.

ఏఏ రంగాలపై ప్రభావం

ఆహారం, ఆతిథ్యం, తయారీ, రిటైల్, వ్యాపార, పరిపాలన రంగాలు అధిక సంక్షోభ ముప్పును ఎదుర్కొంటున్నట్లు ఐఎల్ఓ తెలిపింది. ప్రపంచంలోని 330 కోట్ల మంది ఉద్యోగుల్లో 81 శాతం మంది ఈ లాక్​డౌన్​ వల్ల ప్రభావితమైనట్లు స్పష్టం చేసింది. 125 కోట్ల మంది ఉద్యోగులు 'వినాశకరమైన పరిస్థితులు' ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది. వీరందరూ వేతనాలు, పనిగంటల్లో కోతలతో పాటు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది అసంఘటిత రంగంలో ఉన్నట్లు స్పష్టం చేసిన ఐఎల్ఓ.. వీరిలో అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచే అధికంగా ఉన్నట్లు తెలిపింది.

పరిష్కారానికి నాలుగు అంశాలు

ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు భారీ ఎత్తున విధానపర చర్యలు అవసరమని స్పష్టం చేసింది ఐఎల్ఓ. ఇందుకోసం నాలుగు అంశాలపై దృష్టిసారించాలని సూచించింది.

  • పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం, ఉద్యోగ కల్పన, ఆదాయం పెంపొందించడం
  • ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచి ఉద్యోగాలను సృష్టించడం
  • ఉద్యోగులకు రక్షణ కల్పించడం
  • ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సామాజిక సంభాషణ కొనసాగిస్తూ పరిష్కారాలు కనుగొనడం

ఇదీ చదవండి: 'వైద్యులు ఒక్క మాస్కును 4 సార్లు వినియోగించాలి!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.