తెలంగాణ

telangana

ETV Bharat / business

Petrol Price Hike: రెండో రోజూ పెరిగిన పెట్రోల్​ ధరలు

Petrol Price Hike: దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్​పై 84 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

HIKE IN PETROL AND DIESEL PRICES TODAY
వరుసగా రెండో రోజూ పెరిగిన పెట్రోల్​ ధరలు

By

Published : Mar 23, 2022, 7:33 AM IST

Updated : Mar 23, 2022, 11:34 AM IST

Petrol Price Hike: దేశంలో చమురు ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా లీటర్​ పెట్రోల్​పై 87 పైసలు పెంచుతున్నట్లు (Fuel price Today) చమురు సంస్థలు ప్రకటించాయి. నిన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు చమురు సంస్థలు వంటగ్యాస్‌ ధరలను పెంచిన విషయం తెలిసిందే. నేడు పెంచిన ధరలతో దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.97.05కు చేరగా.. డీజిల్​ ధర రూ.88.31కు ఎగబాకింది. దేశంలోని మెట్రో నగరాలతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.

మెట్రో నగరాల్లో ఇలా..

  • ముంబయిలో లీటర్​ పెట్రోల్​​ ధర 85 పైసలు పెరిగి (Mumbai Petrol Price Today) రూ.111.65కు చేరగా.. లీటర్​ డీజిల్ ​రూ.95.83 వద్ద కొనసాగుతోంది.
  • కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ (Kolkata Petrol Price) ధర 84 పైసలు పెరిగి రూ.106.33గా ఉంది. లీటర్​ డీజిల్ ధర రూ.91.40గా ఉంది.
  • చెన్నైలో లీటర్​ పెట్రోల్​ ధర 76 పైసలు పెరిగి (Chennai Petrol Price) రూ.102.90 వద్ద కొనసాగుతోంది. లీటర్​ డీజిల్ ధర రూ.92.94 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో (Hyderabad Petrol Price Today) లీటర్ పెట్రోల్​ ధర 91 పైసలు పెరిగి రూ.109.99కు చేరుకుంది. మరోవైపు లీటర్ డీజిల్​ ధర రూ.96.35గా ఉంది.
  • గుంటూరులో (Guntur Petrol Price) పెట్రోల్ ధర లీటర్​కు 87 పైసలు పెరిగి రూ.102.08కి చేరింది. డీజిల్​పై ధర​ లీటర్ రూ.98.10 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Vizag Petrol Price Today) లీటర్ పెట్రోల్ ధర 87 పైసలు పెరిగి రూ.110.78కి చేరగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.96.84కి చేరింది.

ఇదీ చూడండి:

10 నిమిషాల్లోనే జొమాటో డెలివరీ! రిస్క్ కాదా? క్వాలిటీ సంగతేంటి?

Last Updated : Mar 23, 2022, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details