తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రివ్యూ 2020: మరింత ప్రియం కానున్న కూరగాయలు! - TOP

కూరగాయల ధరలు వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్ఠాన్ని తాకింది. ఈ రిటైల్​ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయినప్పటికీ 2020 ప్రారంభంలోనూ కూరగాయల ధరలు మరింత పెరుగుతాయని బ్రోకరేజి సంస్థలు అంచనా వేస్తున్నాయి.

High food prices to haunt 2020
ప్రివ్యూ 2020: మరింత ప్రియం కానున్న కూరగాయలు!

By

Published : Dec 28, 2019, 8:01 AM IST

2019 చివరి త్రైమాసికంలో టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. ఉల్లి ధరలు వినియోగదారులకు అక్షరాలా కళ్లనీళ్లు తెప్పించాయి. ఖరీదైన ఆహార పదార్థాల ధరలు రిటైల్​ ద్రవ్యోల్బణాన్ని మూడేళ్ల గరిష్ఠానికి ఎగదోశాయి.

ఉల్లిపాయల ధర సుమారుగా రూ.200 వరకు ఉండగా, టమాటా రిటైల్​ ధర కిలోకు రూ.80 వరకు పెరిగింది. పంట నష్టం, తగినంత సరఫరా లేకపోవడం వల్ల బంగాళదుంపలూ ప్రియం అయ్యాయి. డిసెంబర్​లో కిలో రూ.30 వరకు ఉన్న బంగాళాదుంపలు... ప్రభుత్వ నియంత్రణ చర్యల వల్ల ప్రస్తుతం రూ.20 నుంచి రూ.25 పలుకుతున్నాయి.

ఖరీదైన కూరగాయలు

ఖరీదైన కూరగాయలు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నెమ్మదిగా ఎగదోస్తాయి. 2019 అంతా ఈ కూరగాయల ద్రవ్యోల్బణం ఆర్​బీఐ అంచనాలకు అనుగుణంగా 4 శాతమే ఉంది. నవంబర్​లో మాత్రం మూడేళ్ల గరిష్ఠానికి అంటే 5.54 శాతానికి చేరింది.

టీఓపీ

కేంద్ర ప్రభుత్వం టమాటా, ఉల్లి, బంగాళాదుంప (టీఓపీ)లకు 2018-19 కేంద్ర బడ్జెట్​లో అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. వీటి ఉత్పత్తి, ప్రాసెసింగ్​ పెంచడానికి, ధరల అస్థిరతను తగ్గించడానికి రూ.500 కోట్ల మేర నిధులు కేటాయించింది.

ధరల నియంత్రణ

ప్రభుత్వం 2019లో చాలా వరకు ధరల నియంత్రణలో విజయవంతమైనా.. చివరిలో మాత్రం దెబ్బతింది. ఫలితంగా పెరుగుతున్న ఉల్లి ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం ఆలస్యంగా చర్యలు ప్రారంభించింది. ఈజిప్ట్​, టర్కీ, అఫ్గానిస్థాన్​ నుంచి భారీగా ఉల్లి దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రస్తుతం రోజువారీ లెక్కన టీఓపీ దిగుమతులు భారత్​కు వస్తున్నాయి. ఫలితంగా దేశీయ రిటైల్​ మార్కెట్లలో టీఓపీ ధరలు సుమారుగా.... రూ.130, రూ.20- రూ.30, రూ.30-రూ.40 వరకు దిగొచ్చాయి. మరోవైపు వెల్లుల్లి ధర 100 గ్రాములకు సుమారు రూ.30-రూ.40 వరకు పెరిగింది.

ఆర్​బీఐ చర్యలు

రిటైల్​ ద్రవ్యోల్బణాన్ని ప్రధానంగా ద్వైమాసిక ద్రవ్య విధానం అంచనా వేసే రిజర్వ్​ బ్యాంక్ .. వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి నియంత్రించాలని నిర్ణయించింది. దీనికి 2 శాతం అటుఇటైనా వృద్ధికి తోడ్పడాలని సంకల్పించింది.

ఆర్​బీఐ డిసెంబర్​లో తన ద్రవ్య విధాన సమీక్షలో రిటైల్​ ద్రవ్యోల్బణ అంచనాలను 2019-20 రెండో భాగంలో 5.1 - 4.7 శాతానికి పెంచింది. ప్రధానంగా ఖరీదైన ఉల్లిపాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, పాలు, తృణధాన్యాలపై, అంతకు ముందు ఈ అంచనాలు 3.5 - 3.7 శాతంగా ఉండేవి. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్ధభాగంలో ఈ అంచనాలకు 4 - 3.8 శాతానికి పెంచింది.

ధరలు మరింత పెరుగుతాయ్...

ఐసీఆర్​ఏ ఆర్థికవేత్త అదితి నాయర్​ 2020 ప్రారంభంలో కూరగాయల ధరలు మరింత అధికమవుతాయని అంచనా వేస్తున్నారు.

"భూగర్భ జలాలు, రిజర్వాయర్​ల్లో నీళ్లు పుష్కలంగా ఉంటే.. రబీ ఉత్పత్తి పెరిగి తృణధాన్యాల దిగుబడి పెరుగుతుంది. అయితే పంట భూముల విస్తీర్ణం రానురాను తగ్గుతున్నందున పప్పులు, నూనె గింజల ఉత్పత్తిలో క్షీణత కనిపిస్తోంది. ఫలితంగా రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇది ఆందోళనకరమైన విషయం. "- అదితి నాయర్​, ఐసీఆర్​ఏ ఆర్థికవేత్త

ఐసీఆర్​ఓ 20189 డిసెంబర్​లో వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) ద్రవ్యోల్బణం 5.8 - 6 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది.

హోల్​సేల్​ కథే వేరు...

2019లో హోల్​సేల్​ ద్రవ్యోల్బణం కథ భిన్నంగా ఉంది. జనవరిలో 3.58 శాతంగా ఉన్న హోల్​సేల్​ ద్రవ్యోల్బణం అక్టోబర్​ నాటికి 0.16 శాతానికి తగ్గింది. ఈ మార్పునకు ప్రధానంగా చౌక ఇంధనం, విద్యుత్​ కారణం.

బ్రోకరేజ్​ సంస్థ ఆనంద్​ రతి ప్రకారం డబ్ల్యూపీఐ - సీపీఐ మధ్య తేడా నవంబర్​లో 5.5 శాతంగా ఉంది. అంటే రిటైల్​ ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలో ఉంటే.. హోల్​సేల్​ ద్రవ్యోల్బణం 0.6 శాతం మాత్రమే ఉందని పేర్కొంది.

ఇదీ చూడండి:ఏటీఎమ్​​ మోసాలకు చెక్‌.. నగదు విత్‌డ్రాకు ఓటీపీ

ABOUT THE AUTHOR

...view details