తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రభుత్వ ఉద్దీపనలతో.. సామాన్యులకూ లాభాలే! - జీఎస్టీ రేట్లు

ఆర్థికరంగానికి చేయూతనివ్వడానికి కేంద్రప్రభుత్వంగా తాజాగా మరిన్ని ఉద్దీపనలు ప్రకటించింది. కార్పొరేట్ పన్ను, జీఎస్టీ రేట్లను తగ్గించింది. ఫలితంగా ఆయా రంగాలతో పాటు సామాన్యులకూ పలు లాభాలు కలుగనున్నాయి. ఉత్పత్తి ఖర్చులు తగ్గడం వల్ల సామాన్యులకు అవి అందుబాటు ధరల్లో లభ్యమవుతాయి. ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి.

ప్రభుత్వ ఉద్దీపనలతో.. సామాన్యులకూ లాభాలే!

By

Published : Sep 21, 2019, 6:38 AM IST

Updated : Oct 1, 2019, 10:01 AM IST

మందగమనంలో ఉన్న దేశ ఆర్థికవ్యవస్థను పునరుద్ధరించే దిశగా మరిన్ని ఉద్దీపనలతో ముందుకొచ్చింది కేంద్రప్రభుత్వం. దేశీయ కంపెనీల కార్పొరేట్ పన్నను 30 నుంచి 22 శాతానికి తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఇవి అమల్లోకి వస్తాయని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. ఫలితంగా, బ్యాంకింగ్, వాహన, హోటల్, తయారీ రంగాలు భారీగా పుంజుకున్నాయి. ఫలితంగా పరోక్షంగా సామాన్య ప్రజానీకానికీ లాభం చేకూరనుంది.

సామాన్యులకు కలిగే లాభాలు

కార్పొరేట్​ పన్నులు తగ్గడం వల్ల వాహనాల ఉత్పత్తి కయ్యే ఖర్చులు తగ్గుతాయి. ఫలితంగా వాహనాల రేట్లు తగ్గుతాయి. అపుడు వినియోగదారులకు మునుపటి కంటే చౌక ధరకు వాహనాలు లభ్యమవుతాయి.

ద్విచక్రవాహనాలు, కార్లు అమ్మకాలు, కొనుగోళ్లు పెరగడం వల్ల అటు పరిశ్రమలకు, ఇటు వినియోగదారులకు ఇరువర్గాలకు లాభం చేకూరుతుంది.

జీఎస్టీ తగ్గింపుతో..

హోటల్​ గదుల అద్దెలపై జీఎస్టీ తగ్గిన నేపథ్యంలో... సామాన్యులపై అద్దె భారం తగ్గుతుంది. ఇది ఆతిథ్య, పర్యాటక రంగాల అభివృద్ధికీ దోహదం చేస్తుంది.
ఔట్​ డోర్ క్యాటరింగ్​పై విధించే 18 శాతం పన్ను రేటును 5 శాతానికి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఫలితంగా వంటకాల ధరలు తగ్గే అవకాశం ఉంది. శుభకార్యాలు, ఫంక్షన్లు జరిపేటపుడు వినియోగదారులకు కొంత ఆర్థిక ఊరట లభిస్తుంది.

చింతపండు, గ్రైండర్లు

చింతపండుపై ఉన్న 5 శాతం జీఎస్టీని పూర్తిగా ఎత్తివేసిన నేపథ్యంలో.. హోమ్​ మేకర్స్​​కు చాలా సౌలభ్యం కలుగుతుంది. చింతపండు ధరలు దిగివస్తాయి. అమ్మకాలు పుంజుకుంటాయి. వెట్ గ్రైండర్లపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించిన నేపథ్యంలో.. ఇది గృహస్థులకు, అమ్మకందారులకు మేలు చేస్తుంది.

ఆకులతో చేసే ప్లేట్లు, కప్పులపై ఇంతవరకూ ఉన్న 5 శాతం జీఎస్టీని ఎత్తివేసిన నేపథ్యంలో.. ఆ రంగ కార్మికులకు, అమ్మకందారులకు ప్రయోజనం చేకూరనుంది.
తయారీ రంగం ఊపందుకోవడం వల్ల ఆయా రంగాల నిపుణులకు, కార్మికులకు ఉపాధి లభించనుంది. అలాగే ఉత్పత్తుల ధరలు తగ్గి సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి.

ఇదీ చూడండి: మోదీ-జిన్​పింగ్​ భేటీ నూతన వసంతాన్ని తెచ్చేనా!

Last Updated : Oct 1, 2019, 10:01 AM IST

ABOUT THE AUTHOR

...view details