బంగారం ధర బుధవారం కాస్త పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర అతి స్వల్పంగా..రూ.60 పెరిగి రూ.44,519 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా పసిడి డిమాండ్‌కు అనుగుణంగా దేశీయంగానూ బంగారం ధరలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. రూపాయి క్షీణత కూడా ఇందుకు కారణమైనట్లు తెలుస్తోంది.