బంగారం ధర నేడు భారీగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర నేడు రూ.1,395 ఎగిసి.. రూ.41,705 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా బంగారం ధరలు పెరిగిన కారణంగా ఆ ప్రభావం దేశీయంగా పడింది అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పసిడి బాటలోనే వెండి ధర కిలోకు నేడు రూ.2,889(దిల్లీలో) పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.38,100 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,514 డాలర్లుగా ఉండగా, వెండి ఔన్సుకు 12.96 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:కరోనా భయాల్లోనూ బుల్ జోరు- సెన్సెక్స్ 1,628+