తెలంగాణ

telangana

ETV Bharat / business

'గూగుల్​ పే' యూజర్లకు గుడ్​న్యూస్​

గూగుల్ పే ద్వారా చేసే చెల్లింపులపై అమెరికాలోని వినియోగదారులకు మాత్రమే ఛార్జీలు వర్తిస్తాయని సంస్థ ప్రతినిధి స్పష్టం చేశారు. భారత్​లోని గూగుల్​ పే, గూగుల్ పే బిజినెస్ అప్లికేషన్లకు దీనితో సంబంధం లేదన్నారు.

Fee on money transfers for US, doesn't apply to India: Google Pay
'గూగుల్​ పే ఛార్జీలు భారత్​కు కాదు'

By

Published : Nov 25, 2020, 3:54 PM IST

గూగుల్ ఫ్లాట్​ఫాం ద్వారా చేసే చెల్లింపులపై ఛార్జీ వసూలు చేస్తామన్న ప్రకటనపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. ఈ నియమం అమెరికాలోని వినియోగదారులకే వర్తిస్తుందని తెలిపింది. భారత్​లోని యూజర్లు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

"ఈ ఛార్జీలు, ఫీజులు కేవలం అమెరికాకు సంబంధించినవి. భారత్​లోని గూగుల్ పే, గూగుల్ పే బిజినెస్ అప్లికేషన్లకు ఇవి వర్తించవు."

-గూగుల్ ప్రతినిధి

రీడిజైన్ చేసిన గూగుల్​ పే యాప్​ను వచ్చే ఏడాది ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్​లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ గతవారం ప్రకటించింది. ముందుగా అమెరికాలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. దీని వల్ల వెబ్​ బ్రౌజర్​లో తమ సేవలు నిలిచిపోతాయని వెల్లడించింది. గూగుల్​ పే ద్వారా చేసే తక్షణ నగదు బదిలీలపై సంస్థ ఛార్జీలు వసూలు చేస్తుందని కథనాలు వచ్చాయి.

ABOUT THE AUTHOR

...view details