తెలంగాణ

telangana

ETV Bharat / business

బాలలపై వేధింపుల కట్టడికి ఫేస్​బుక్​ కొత్త టూల్స్​

చిన్నారులపై వేధింపులకు సంబంధించిన అంశాలపై ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్​బుక్​ దృష్టి సారించింది. తమ ప్లాట్​ఫాం ద్వారా.. చిన్నారులకు హాని కలిగించే సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు.. నిబంధనలు కఠినతరం చేయనున్నట్లు స్పష్టం చేసింది.

Facebook intensifies fight against child abuse content; tightens norms, adds new tools
చిన్నారులపై వేధింపుల అడ్డుకట్టకు ఫేస్​బుక్​ కొత్త టూల్స్​

By

Published : Feb 24, 2021, 6:12 PM IST

చిన్నారులపై జరిగే వేధింపులు, దూషణలకు సంబంధించిన అంశాలు తమ ప్లాట్​ఫాం ద్వారా వ్యాప్తి చెందకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌. అందులో భాగంగా నిబంధనలను కఠినతరం చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. చిన్నారులకు హాని కలిగించే సమాచారానికి అడ్డుకట్ట వేయడం సహా పర్యవేక్షించేందుకు త్వరలోనే కొత్త టూల్స్ తెస్తున్నట్లు వివరించింది.

''చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన అంశాల వ్యాప్తిని ఏమాత్రం సహించబోం. చిన్నారులకు హాని తలపెట్టే పనులకు.. తమ అప్లికేషన్లను వినియోగించడం హేయమైన చర్య. అలాంటి చర్యలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.''

- డేవిస్, ఫేస్​బుక్​ భద్రతా విభాగం గ్లోబల్​ హెడ్​ ​

తొలి టూల్​లో ఇలాంటి అంశాలపై శోధించినవారికి హెచ్చరిక సందేశం పంపుతుంది ఫేస్​బుక్​.

రెండో దాంట్లో.. చిన్నారులకు ఇబ్బంది కలిగించే సమాచారాన్ని షేర్​ చేసి, మీమ్స్​ సృష్టించే వారికి సేఫ్టీ అలర్ట్​ను చూపిస్తుంది. సంబంధిత సమాచారం.. తమ విధానాలకు విరుద్ధమని, వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతుంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకొనే అవకాశం కూడా ఉంది.

ఇదీ చూడండి:బిట్​కాయిన్​లో ట్విట్టర్​ బాస్​ భారీ పెట్టుబడి

ABOUT THE AUTHOR

...view details