తెలంగాణ

telangana

ETV Bharat / business

'కరోనా ప్రభావం.. 2008 మాంద్యానికన్నా దారుణం' - నో వేర్ టు హైడ్

కరోనా ప్రభావం.. 2008 మాంద్యానికన్నా దారుణంగా ఉంటుందని ఓ అధ్యయనం పేర్కొంది. ఈ మేరకు తమ అధ్యయనంలో పాల్గొన్న 70శాతం మంది ఈ విషయాన్ని అంగీకరించినట్టు వివరించింది. సరఫరా, ఉద్యోగుల లభ్యత, బడ్జెట్​పై కరోనా ప్రభావం భారీగా పడిందని వెల్లడించింది. ఇన్ఫోసిస్​, హెచ్​ఎఫ్​ఎస్​ రీసర్చ్​ సంయుక్తంగా చేపట్టింది ఈ అధ్యయనం.

Covid impact on  business
'కరోనా ప్రభావం... 2008 మాంద్యానికన్నా దారుణం!'

By

Published : Dec 3, 2020, 7:43 PM IST

కరోనా సంక్షోభం ప్రభావం... 2008 మాంద్యానికి మించి ఉంటుందా? అనే ప్రశ్నకు 70శాతం వ్యాపారవేత్తలు అవుననే సమాధానమిచ్చినట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. బడ్జెట్​, సరఫరా, ఉద్యోగుల లభ్యత, వినియోగదారుల సాన్నిహిత్యంపై కరోనా ప్రభావం భారీగా పడిందని అధ్యయనం పేర్కొంది.

'నోవేర్​ టు హైడ్​: ఎంబ్రేసింగ్​ ది మోస్ట్​ సీస్మిక్​ టెక్నలాజికల్​ అండ్​ బిజినెస్​ ఛేంజ్​ ఇన్​ అవర్​ లైఫ్​ టైమ్​' పేరుతో హెచ్​ఎఫ్​ఎస్​ రీసర్చ్​, ఇన్​ఫోసిస్​ ఓ సంయుక్త అధ్యయనం చేపట్టాయి. మొత్తం 400 మంది గ్లోబల్​, 2000 మంది ఎగ్జిక్యూటివ్​లపై ఈ అధ్యయనం చేశాయి. కరోనా సంక్షోభంలో పనిచేయాలంటే వర్క్​ ఫ్రం హోం వంటి సదుపాయాలపైనే 51శాతం సంస్థలు మొగ్గుచూపుతున్నట్టు పేర్కొన్నాయి.

అదే సమయంలో.. క్లౌడ్​, సైబర్​సెక్యూరిటీ, మోడర్నైజేషన్​తో డిజిటల్​ వ్యాపార మోడళ్లకు శక్తి లభిస్తుందని, ఐటీ ఖర్చులు పెరుగుతాయని అధ్యయనంలో తేలింది.

మరిన్ని అంశాలు....

  • కస్టమర్లను అకర్షించేందుకు, వారికి త్వరితగతిన సేవలు అందించేందుకు అనేక సంస్థలు ఆటోమేషన్, డిజిటల్​ బిజినెస్​ మోడళ్లను అవలంభించాయి.
  • కరోనా సంక్షోభంతో కొత్త అవకాశాలు లభించాయని, పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకింగ్, భీమా సంస్థలు, హైటెక్ పరిశ్రమల వ్యాపారులు ధీమా వ్యక్తం చేశారు.
  • దాదాపు 60 శాతం వ్యాపార సంస్థలు డిజిటల్​ విధానంలో కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు యోచించగా, దాదాపు 70 శాతం సంస్థలు వినియోగదారుల కోసం.. తమ వస్తు ఉత్పత్తిని, వస్తు సేవలను మార్చేందుకు ప్రణాళిక రచిస్తున్నాయి.
  • కరోనా తర్వాత ఆఫీసుకు వెళ్లేందుకు కేవలం 37శాతం మందే మొగ్గుచూపుతున్నారు.

ఇదీ చదవండి:బీమా పత్రాలకు ధీమానిచ్చే ఈ-ఇన్సూరెన్స్

ABOUT THE AUTHOR

...view details