మూడేళ్ల తమ బంధానికి ముగింపు పలికారు బిలియనీర్ ఎలాన్ మస్క్- సింగర్ గ్రిమ్స్(elon musk grimes). ఈ విషయాన్ని మస్క్ ప్రకటించారు టెస్లా అధినేత.
"మేము విడిపోతున్నాము. కానీ పుర్తిగా విడిపోవడం లేదు. మేము ఇంకా ప్రేమలోనే ఉన్నాము. అప్పుడప్పుడు కలిస్తూ ఉంటాం. మా మధ్య అంతా బాగానే ఉంది. స్పేస్ఎక్స్, టెస్లా కోసం నేను ఎక్కువ పనిచేయాల్సి ఉంటుంది. అది కూడా టెక్సాస్‌కు వెళుతూ ఉండాలి. గ్రిమ్స్ ఇక్కడ(లాస్ఏంజెల్స్) ఉంటుంది. ప్రస్తుతానికైతే నా దగ్గరే ఉంటోంది."
-- ఎలాన్ మస్క్, టెస్లా అధినేత.
50ఏళ్ల మస్క్- 33ఏళ్ల గ్రేమ్స్కు పుట్టిన తొలి సంతానం పేరు ఎక్స్ఆయ్ఎయ్(2020 మే).(elon musk son name)
అంతకుముందు కెనడాకు చెందిన రచయిత్రి జస్టిన్ విల్సన్‌తో విడాకులు తీసుకున్నారు మస్క్(elon musk wife). వారికి ఐదుగురు కుమారులు. ఆ తర్వాత ప్రముఖ స్టార్ రిలేను రెండుసార్లు వివాహమాడిన మస్క్.. 2015లో విడిపోయారు. అనంతరం గ్రిమ్స్‌తో బంధాన్ని 2018లో బయటపెట్టారు.
బిలియనీర్లే.. కానీ..
బిలియనీర్లు విడాకులు తీసుకుంటున్న వార్తలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తమ 27ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్‌గేట్స్, మెలిందా ఇటీవలే ప్రకటించారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్-మెకాంజీ స్కాట్ 2019లో విడాకులు తీసుకున్నారు. ప్రముఖ గోల్ఫ్ ప్లేయర్ టైగర్ వుడ్స్, ఎలిన్ నోర్డెగ్రెన్.. 2004లో విహహం చేసుకుని.. ఆరేళ్లకే (2010) విడాకులు తీసుకున్నారు. బాస్కెట్ బాల్ ప్లేయర్ మైకెల్ జోర్డాన్, జువానిటా వనోయ్ 2006లో విడాకులు తీసుకున్నారు.
ఇదీ చూడండి:-వీరివి అత్యంత ఖరీదైన విడాకులు!