అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు అంతకంతకూ తగ్గుతూ వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండటమే ఇందుకు కారణం. ఫలితంగా చమురుకు డిమాండ్ భారీగా తగ్గిపోయింది. ఇందుకు తగ్గట్లు ప్రధాన చమురు సంస్థల మధ్య ఉత్పత్తి తగ్గించాలనే ఒప్పందం కుదరకపోవడం ధరలు మరింత క్షీణిస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ 9 శాతం క్షీణిచింది. బ్యారెల్ ముడిచమురు ధర 45.50 డాలర్లకు చేరింది. 2017 తర్వాత ఈ స్థాయిలో ధరలు తగ్గడం ఇదే ప్రథమం. అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ బ్యారెల్ ధర 41.11 డాలర్లకు చేరింది.
ఈ ఏడాది ఇప్పటికే మొత్తం మీద అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 30 శాతం తగ్గింది. జనవరి 8న బ్యారెల్ ముడిచమురు ధర 71.75 డాలర్లను తాకింది. ప్రస్తుతం 45.50 డాలర్లకు చేరింది.