ఆధార్‌తో పాన్ కార్డు అనుసంధాన (aadhaar pan link) గడువును ఆరు నెలల పాటు అంటే 2022 మార్చి వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. "కరోనా కారణంగా వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, ఆధార్ సంఖ్యను శాశ్వత ఖాతా సంఖ్య(పాన్)తో అనుసంధానం చేయడానికి గడువును సెప్టెంబరు 30, 2021 నుంచి మార్చి 31, 2022 వరకు పొడిగిస్తున్నాం" అని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు(సీబీడీటీ) ఒక ప్రకటనలో పేర్కొంది.
aadhaar pan link: 'పాన్-ఆధార్ అనుసంధాన గడువు పొడిగింపు'
ఆధార్‌తో పాన్ కార్డు అనుసంధానం (aadhaar pan link) చేసుకోవడానికి గడువును మరోసారి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. 2022 మార్చి 31 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపింది.
ఆధార్ పాన్ లింక్
అదే సమయంలో.. ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ప్రోపర్టీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్-1988 కింద నోటీసులు, ఆదేశాల జారీకి గడువును సైతం మార్చి 2022 వరకు పెంచారు.
Last Updated : Sep 18, 2021, 6:57 AM IST