తెలంగాణ

telangana

ETV Bharat / business

సెకండ్ హ్యాండ్​లో కొత్త వాహనాలు కావాలా?

లాక్​డౌన్​ కారణంగా మార్చి 31న ముగియాల్సిన బీఎస్ 4 వాహనాల విక్రయాల గడువును పెంచింది సుప్రీంకోర్టు. ఆ గడువు కూడా ఇటీవల ముగిసింది. ఈ నేపథ్యంలో ఇంకా మిగిలిపోయిన స్టాక్​ను సెకండ్ హ్యాండ్​లో విక్రయిస్తున్నారు డీలర్లు. షోరూంలో సెకండ్ హ్యాండ్ ఏమిటీ? అనేగా మీ సందేహం? అదేంటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

second hand vehicles in showrooms
షోరూంలో సెకండ్ హ్యాండ్ వాహనాలు

By

Published : Jun 18, 2020, 3:20 PM IST

లాక్​డౌన్​ తర్వాత పది రోజుల వరకు 10 శాతం బీఎస్​4 (ఇప్పటికే ఉన్న స్టాక్) వాహనాలను విక్రయించుకునేందుకు డీలర్లకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. ఆ గడువు కూడా ఇటీవల ముగిసింది. ఈ నేపథ్యంలో మరోసారి గడువు పెంచాలని డీలర్లు చేసిన విన్నపాన్ని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అయితే డీలర్లు మాస్టర్ ప్లాన్​ వేశారు. మిగతా స్టాక్​ను తమ పేర్ల మీద రిజిస్టర్ చేసుకుని.. అవే వాహనాలను సెకండ్​ బ్యాండ్​లో విక్రయిస్తున్నాయి.

మరి వీటిని కొనడం సురక్షితమేనా? సురక్షితమైతే వీటిని కొనడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి? ఆ విషయాలు చూద్దాం.

సెకండ్ హ్యాండ్ విక్రయాలకు కారణాలు..

తమ వద్దనున్న బీఎస్ 4 వాహనాలను డీలర్లు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. డిస్కౌంట్లు ప్రకటించి.. సెకండ్ హ్యాండ్ లో వాటిని విక్రయిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. భారీ డిస్కౌంట్లతో చాలా వరకు బీఎస్-4 స్టాక్ విక్రయించగలిగామని అంటున్నారు. గడువు ముగిసిన కారణంగా మిగితా స్టాక్​ను ఇలా సెకండ్ హ్యాండ్​లో విక్రయిస్తున్నట్లు తెలిపారు.

ఎగుమతి చేసేందుకు, వేరే రాష్ట్రాల్లో అమ్ముకునేందుకు తమకు అనుమతులు లేనందున ఇలా చేస్తున్నట్లు తెలిపారు. అయితే వాహన తయారీ కంపెనీలు మాత్రం ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంది.

వీటిని కొనడం వల్ల లాభాలు ఏమిటి?

షోరూంలలో ఏవైనా బీఎస్ 4 వాహనాలు ఉన్నట్లయితే ప్రస్తుతం అవి రిజిస్ట్రర్ అయి ఉంటాయి. వాటిని సెకండ్ హ్యాండ్​లో కొనుగోలు చేసుకోవచ్చు. వాటిని ఆన్ రోడ్ ఫ్రైజ్ కంటే తక్కువ ధరకు పొందవచ్చు. రోడ్ ట్యాక్స్, బీమా వంటి ఛార్జీలు తగ్గుతాయని డీలర్లు చెబుతున్నారు.

మొత్తం మీద 15 నుంచి 20 శాతం వరకు తక్కువ ధరకే ఆ వాహనాలను సొంతం చేసుకోవచ్చు. దీనితో పాటు విక్రయదారులు ఇచ్చే డిస్కౌంట్లతో అదనపు ప్రయోజనం కూడా పొందవచ్చు.

ఇదీ చూడండి:ప్రతికూలానికి భారత వృద్ధి అంచనాలు: ఫిచ్​

ABOUT THE AUTHOR

...view details