తెలంగాణ

telangana

ETV Bharat / business

జీఎంఆర్​తో అమెజాన్​.ఇన్ భారీ ఒప్పందం

ఈ- కామర్స్ దిగ్గజం 'అమెజాన్​.ఇన్'​ దేశంలోనే అతిపెద్ద ఫుల్​ఫిల్​మెంట్​ కేంద్రాన్ని విస్తరించడం కోసం జీఎంఆర్​ హైదరాబాద్​ ఎయిర్​పోర్టు సిటీతో ఒప్పందం చేసుకుంది.

జీఎంఆర్​తో అమెజాన్​.ఇన్ భారీ ఒప్పందం

By

Published : Aug 2, 2019, 2:34 PM IST

భారత్​లో తన అతిపెద్ద ( ఫుల్​ఫిల్​మెంట్) సరుకు రవాణా కేంద్రాన్ని​ విస్తరించడం కోసం జీఎంఆర్​ హైదరాబాద్ ఎయిర్​పోర్టు సిటీతో భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్​.ఇన్​ పేర్కొంది.

ప్రస్తుతం ఉన్న గిడ్డంగి 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీన్ని మరో 1.8 లక్షల చదరపు అడుగులకు విస్తరించనున్నట్లు అమెజాన్​.ఇన్​ తెలిపింది.

"ఈ పెట్టుబడితో, అమెజాన్​.ఇన్​.... రాష్ట్రంలో మూడుకి మించి సరుకు రవాణా కేంద్రాలను కలిగి ఉంది. మొత్తం ప్రాసెసింగ్ ప్రాంతము 8.5 లక్షల చదరపు అడుగులకు పైగా ఉంది."

- అమెజాన్​. ఇన్​

అయితే ఈ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ తన మొత్తం పెట్టుబడి పరిమాణాన్ని మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం.

పోటీని తట్టుకునేందుకే...

ప్రస్తుతం భారత విపణిలో ఫ్లిప్​కార్ట్​తో గట్టి పోటీని ఎదుర్కొంటోంది అమెజాన్​.ఇన్​. అయితే ప్రస్తుతం జీఎంఆర్​తో చేసుకున్న ఒప్పందం వల్ల పండుగ సీజన్​లో... అమెజాన్​.ఇన్​ తన వినియోగదారులకు వేగవంతమైన సేవలు అందించడానికి వీలవుతుంది.

సంప్రదాయ గిడ్డంగుల మాదిరి కాకుండా, ఫుల్​ఫిల్​మెంట్​ కేంద్రాల్లో... ఆటోమేటెడ్​ పిక్​, ప్యాక్​, షిప్పింగ్​ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఫలితంగా ఆర్డర్లను నిర్ణీత సమయానికే డెలివరీ చేసే అవకాశం ఉంటుంది.

వ్యాపార విధానాన్నే మార్చేస్తాం

"భారత్​లో కొనుగోలు, అమ్మకాల విధానాన్ని పూర్తిగా మార్చాలనే దృష్టితో, మా మౌలిక సదుపాయాలు, డెలివరీ నెట్​వర్కుల్లో స్థిరంగా పెట్టుబడులు పెడుతున్నాం. ఫలితంగా మా వినియోగదారులకు వేగంగా డెలివరీ చేయడానికి వీలవుతుంది. ఇది అమ్మకందారులకు, వినియోగదారులకు ఉత్తమ అనుభూతిని అందిస్తుంది."

- అఖిల్​ సక్సేనా, అమెజాన్​ వైస్​ ప్రెసిడెంట్​, కస్టమర్ ఫుల్​ఫిల్​మెంట్​ - ఆసియా

ఈ అమెజాన్​.ఇన్​ సరుకు రవాణా కేంద్రం ఏర్పాటు ద్వారా మరిన్ని నైపుణ్యంగల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని సక్సేనా పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అమెరికా- చైనా గిల్లికజ్జాలతో మార్కెట్లు కుదేలు

ABOUT THE AUTHOR

...view details