తెలంగాణ

telangana

ETV Bharat / budget-2019

పద్దు 2019: బడ్జెట్​ ప్రక్రియ సాగనుందిలా...​ - SCHEDULE

భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారం చేపట్టాక మొదటి బడ్జెట్​ను కాసేపట్లో ప్రవేశ పెట్టనుంది. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో వివరంగా తెలుసుకోండి.

నేడు పార్లమెంటులో వార్షిక బడ్జెట్​ను ప్రవేశ పెట్టనుంది భాజపా నేతృత్వంలోని మోదీ సర్కార్

By

Published : Jul 5, 2019, 8:14 AM IST

Updated : Jul 5, 2019, 9:43 AM IST

కాసేపట్లో పార్లమెంటులో వార్షిక బడ్జెట్​ను ప్రవేశ పెట్టనుంది భాజపా నేతృత్వంలోని మోదీ సర్కార్​. సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం అనంతరం.. కోట్లాది ప్రజల అంచనాలు, ఆకాంక్షల నడుమ పద్దును తీసుకురానుంది.

  1. బడ్జెట్​ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.
  2. ఉదయం 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలో కేంద్ర మంత్రివర్గం భేటీ అవుతుంది. సభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్​కు కేబినెట్​ ఆమోదం తెలుపుతుంది.
  3. ఉదయం 11 గంటలకు లెదర్​ సూట్​కేసుతో వచ్చి లోక్​సభలో బడ్జెట్​ ప్రవేశపెడుతారు నిర్మలా సీతారామన్​.
  • ఇందిరాగాంధీ తర్వాత లోక్​సభలో బడ్జెట్​ ప్రవేశపెడుతున్న తొలి మహిళా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.
  • పూర్తిస్థాయి కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన నిర్మలా సీతారామన్​కు ఇది మొదటి పరీక్ష.

గత బడ్జెట్​లో...

ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్​లో మోదీ ప్రభుత్వం అనేక ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకుంది. మధ్య తరగతి వర్గాలకు ఊరటనిచ్చే పన్ను రిబేటు పెంపు లాంటివి ప్రకటించింది.

రైతుల సంక్షేమం కోసం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ బడ్జెట్​లోనూ కొత్త పథకాలతో పాటు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు చోటుంటుందని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Last Updated : Jul 5, 2019, 9:43 AM IST

ABOUT THE AUTHOR

...view details