కన్నడ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తనకు రూ.40 కోట్లు ఇస్తామని కొందరు ప్రలోభ పెట్టేందుకు యత్నించారని జేడీఎస్ ఎమ్మెల్యే కె. మహదేవ్ చెప్పిన వీడియో కర్ణాటకలో ఆసక్తికర చర్చకు దారితీసింది. పిరియపట్న నియోజక వర్గంలోని స్థానికులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని మహదేవ్ వెల్లడించారు. తనను ఎవరు సంప్రదించారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు ఈ ఎమ్మెల్యే.
భాజపానే.. మహదేవ్తో సంప్రదింపులు జరిపి ఉంటుందని కాంగ్రెస్ ఆరోపించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ అవినీతి సొమ్ముతో కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తోందని ట్వీట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం ఆపరేషన్ 'కమలం' పేరుతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నిస్తోందని విమర్శించింది కాంగ్రెస్.
ఇటీవలే రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ జర్కిహోలి.. కూటమి ప్రభుత్వంలో కొనసాగాలంటే రూ.80 కోట్లు డిమాండ్ చేసినట్లు అక్కడి స్థానిక మీడియాలో ప్రసారమైన మహదేవ్ వీడియోలో ఉంది. అయితే ఈ విషయంపై స్పందించేందుకు జేడీఎస్ ఎమ్మెల్యే మహదేవ్.