తెలంగాణ

telangana

ETV Bharat / briefs

తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తి

తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్​ గండికోట శ్రీదేవిని సుప్రీంకోర్టు కొలీజియం ఎంపిక చేసింది. ఈమె ఆంధ్రప్రదేశ్​కు చెందిన మహిళ కావటం ప్రత్యేకతను సంతరించుకుంది.

తెలుగు ఆడపడుచు..

By

Published : Apr 16, 2019, 6:29 AM IST

Updated : Apr 16, 2019, 7:39 AM IST

తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తిగా జస్టిస్​ గండికోట శ్రీదేవి రానున్నారు. ప్రస్తుతం అలహాబాద్​ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్​ శ్రీదేవిని... తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని జస్టిస్​ శ్రీదేవి పెట్టుకున్న వినతికి స్పందించి సానుకూల నిర్ణయం తీసుకుంది.

తెలుగు ఆడపడుచు...

జస్టిస్​ శ్రీదేవి ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరంలో 1960 అక్టోబర్​ 10న జన్మించారు. అఖిల భారత కోటాలో ఉత్తర్​ప్రదేశ్​ జ్యుడీషియల్​ సర్వీసులో చేరి... 2016లో జిల్లా సెషన్స్​ కోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. ఉత్తర్​ప్రదేశ్​లోని పలు జిల్లాల్లో న్యాయమూర్తిగా సేవలందించారు. ఘజియాబాద్​ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగానూ పనిచేశారు. అనంతరం 2017లో యూపీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 నవంబరు 22న అలహాబాద్​ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

తెలుగు ఆడపడుచు..

ఇవీ చూడండి: పట్టువదలని విక్రమార్కుడిలా అనుకున్నది సాధించాడు

Last Updated : Apr 16, 2019, 7:39 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details