ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు విడుదలయ్యాయి. రూ.31.13 కోట్లు విడుదల చేస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులలో ప్రణాళిక శాఖ తెలిపింది.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శుభవార్త - నియోజకవర్గ అభివృద్ధి నిధులు విడుదల
అసెంబ్లీ ఎన్నికలు జరిగి దాదాపు ఆరు నెలలు గడుస్తున్న... నిధులు లేక నియోజకవర్గాల వారీగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఎట్టకేలకు ఈరోజు ప్రణాళిక శాఖ నియోజకవర్గ అభివృద్ధి నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నియోజకవర్గ అభివృద్ధి నిధులు విడుదల