2017లో నమోదు చేసిన కేసులో సీబీఐ బెంగళూరు బ్రాంచ్ ..సుజనా చౌదరికి సమన్లు జారీ చేసిందని పీటీఐ తెలిపింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ వ్యవహారంలో బ్యాంకులకు నష్టం చేకూర్చినట్లు కేసు నమోదుచేశారని చెప్పింది. 2017లో ఆంధ్రా బ్యాంకును రూ.71 కోట్ల మేర మోసం చేసిన కేసులో సమన్లు జారీ అయ్యాయని తెలిపింది. ఈ వ్యవహారంలో తమ ముందు హాజరుకావాలని సీబీఐ సమన్లు పంపిందని... శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరు సీబీఐ అధికారుల ముందు సుజనాచౌదరి హాజరుకానున్నారని చెప్పింది.
సంబంధం లేని అంశాల్లో నోటీసులా?: సుజనా
సీబీఐ సమన్లపై సుజనా చౌదరి ఓ నోట్ విడుదల చేశారు. సీబీఐ జారీ చేసిన సమన్లు బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజినీరింగ్ ప్రాజెక్టు లిమిటెడ్‌కు చెందినవని పేర్కొన్నారు. ఆ కంపెనీతో తనకు సంబంధమే లేదని తేల్చి చెప్పారు. 2014 నుంచి ఏ కంపెనీలోనూ ఎగ్జిక్యుటివ్, నాన్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్‌గా లేనని వెల్లడించారు. 2003 నుంచి 2014 వరకు 3 లిస్ట్‌డ్ కంపెనీల్లో నాన్ ఎగ్జిక్యుటివ్ హోదాలో ఉన్నానని పేర్కొన్నారు. యూనివర్సల్ ఇండస్ట్రీస్, స్పెల్‌డిడ్ మెటల్ ప్రొడక్స్, నియాన్ టవర్స్ కంపెనీల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ హోదాలో ఉన్నట్టు తెలిపారు. తనకు సంబంధం లేదని సంస్థ వ్యవహారాల్లో నోటీసులు ఇచ్చారని... తదుపరి చర్యలకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి : ఇంటర్ బోర్డు నిర్వాకంపై కేసీఆర్,కేటీఆర్‌లు స్పందించాలి