హైదరాబాద్ నాగోల్లోని నాగార్జున పాఠశాల భవనం నాలుగో అంతస్తు నుంచి ఓ విద్యార్థిని ప్రమాదవశాత్తు పడి చనిపోయింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని వివిక... భవనంపై నుంచి జారి పడి తీవ్రంగా గాయపడింది. వెంటనే బాలికను హుటాహుటిన కామినేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స మొదలుపెట్టిన కాసేపటికే అమ్మాయి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే..
తల్లిదండ్రులకు విషయం చేరవేయగా... ఆస్పత్రికి చేరుకున్నారు. తన కూతురు పాఠశాల యాజమాన్యం వల్లే మరణించిందంటూ... కన్నీరుమున్నీరయ్యారు.