పదోతరగతి ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. గతంలో ఎన్నడూ 85 శాతానికి మించని ఉత్తీర్ణత ఈ ఏడాది 92.43 శాతం సాధించడం చర్చకు మూలకారణమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,06,202 మంది విద్యార్థుల పరీక్ష రాయగా.. కేవలం 38,343 మంది మాత్రమే ఫెయిలయ్యారు. ఫలితాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందపడుతున్నారు. కాని ఎన్నడూ లేనిది ఇలాంటి అద్భుత ఫలితాలు ఎలా సాధ్యమయ్యాయన్నదే ప్రజల చర్చకు కారణం.
పది ఫలితాలతో ఆనందమా.. ఆశ్చర్యమా..?
పదోతరగతి ఫలితాలు ఓ వైపు ఆనందాన్ని మరోవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఎప్పుడూ లేనంతగా 92.43 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బదిలీలు, ఎన్నికల విధులతో సతమతమైన ఉపాధ్యాయులు భోదనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోయినప్పటికీ అద్భుత ఫలితాలు ఎలా వచ్చాయన్న అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ssc-result
సీబీఎస్ఈను మించిపోయింది
ఎప్పుడూ సీబీఎస్ఈ, ఐసీఎస్ కంటే తక్కువగా ఉండే ఎస్ఎస్సీ ఫలితాలు ఈ ఏడాది వాటిని మించిపోయాయి. అంచనాలకు అందనంతగా ఉత్తీర్ణత పెరగడం ఓవైపు ఆనందాన్నిస్తున్నా.. మరోవైపు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంటర్ ఫలితాల వల్ల జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకునే ఉత్తీర్ణతా శాతం పెంచారని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఉపాధ్యాయులు, ఇతర ఉన్నతాధికారులు అంకిత భావంతో కృషిచేశారని దాని ఫలితంగానే ఉత్తీర్ణతా శాతం పెరిగిందటున్నారు.