భూతల స్వర్గంగా కశ్మీర్
రెండు రోజులుగా కురుస్తోన్న మంచుతో జమ్ముకశ్మీర్ భూతల స్వర్గంగా మారింది. హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాలోనూ ఆహ్లాద వాతావరణం చూపరుల్ని కట్టిపడేస్తోంది.
జమ్ముకశ్మీర్ మంచు అందాలు
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో ఓ పక్క అందమైన దృశ్యాలు దర్శనమిస్తుంటే మరో పక్క జనజీవనానికి ఇబ్బందులు తప్పడం లేదు. దారుల్లో పేరుకుపోయిన మంచును తొలగించేందుకు అవస్థలు పడుతున్నారు.
డోడా, రాజౌరీ జిల్లాల్లో భారీగా కురుస్తున్న మంచుతో ప్రయాణాలు రద్దు చేసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు అధికారులు.