కారు, సారు, పదహారు నినాదం గంగలో కలిసిందని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తీవ్రంగా విమర్శించారు. నాలుగు నెలల్లోనే తెలంగాణ రాజకీయాల్లో మార్పులు వచ్చాయని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని పేర్కొన్నారు. ఏపీ విభజన చట్టంలోని హామీల కోసం తమ ఎంపీలు పోరాడుతారని స్పష్టం చేశారు.
కారు, సారు నినాదం గంగలో కలిసింది: షబ్బీర్
కేసీఆర్ రాచరిక పాలనకు ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ధి చెప్పారని షబ్బీర్ అలీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఆధిక్యం ఉన్న చాలా చోట్ల వారి ఓట్లు తగ్గాయని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షులుగా రాహుల్ గాంధీయే కొనసాగాలని పీసీసీ పెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపారు.
shabbir ali