భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ.. అడిడాస్ సంస్థతో తన ఒప్పందాన్ని పొడిగించుకున్నాడు. ఈ సంస్థ ఉత్పత్తులు క్రీడాకారులకు ఎంతో అనువుగా ఉంటాయని తెలిపాడు.
2013 నుంచి రోహిత్ శర్మ ఈ కంపెనీతో కొనసాగుతున్నాడు. ఈ మధ్యే టీమిండియా తరఫున వేగంగా వన్డేల్లో 8,000 పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
అడిడాస్ సంస్థ ఉత్పత్తులు క్రీడాకారులకు ఎంతో సహాయపడుతున్నాయి. గాయలవ్వకుండా రక్షిస్తున్నాయి. క్రీడా ఉత్పత్తుల విక్రయాల్లో ఈ బ్రాండ్ ముందుంది. మా బంధం మరింత బలపడాలని కోరుకుంటున్నా -రోహిత్ శర్మ, భారత క్రికెటర్
స్ప్రింటర్ హిమాదాస్, హాకీ క్రీడాకారుడు మన్‌ప్రీత్ సింగ్, హెఫ్టాథ్లెట్ స్వప్నా బర్మాన్... ఇప్పటికే ఈ అడిడాస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.