తెలంగాణ

telangana

ETV Bharat / briefs

బెల్లంకొండ సినిమాలో 'రాక్షసుడు' ఎవరు? - రాట్ససన్

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న 'రాక్షసుడు' తొలిరూపు విడుదలైంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమా రంజాన్​కు రానుంది.

బెల్లంకొండ శ్రీనివాస్ 'రాక్షసుడు' సినిమా తొలిరూపు

By

Published : Apr 6, 2019, 5:27 PM IST

కోలీవుడ్​లో సూపర్‌ హిట్ అయిన థ్రిల్లర్‌ మూవీ 'రాట్ససన్‌'. తెలుగులో 'రాక్షసుడు' పేరుతో రీమేక్​ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ ప్రధాన పాత్రల్లో నటించారు. ఉగాది సందర్భంగా సినిమా ఫస్ట్​లుక్​ విడుదలైంది. "ఓ వ్యక్తి కత్తి పట్టుకుని నిల్చుని ఉండగా ఎదురుగా హీరో హీరోయిన్​ భయపడుతున్నట్లు" ఉన్న పోస్టర్ ఆసక్తి రేపుతోంది.

రాక్షసుడు సినిమా ఫస్ట్​లుక్

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పోలీస్​గా కనిపించనున్నాడు శ్రీనివాస్. రమేష్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. రంజాన్​కు చిత్రం విడుదల కానుంది.

తేజ దర్శకత్వం వహిస్తున్న 'సీత' సినిమాలోనూ నటిస్తున్నాడీ హీరో. ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details