తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'రాష్ట్రాన్ని కుటుంబ పాలన నుంచి కాపాడేది భాజపా'

తెలంగాణను కుటుంబ పాలన నుంచి కాపాడేది భాజపాయేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్​కు తగిన బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపాయేనని ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

By

Published : Jun 12, 2019, 10:44 PM IST

ఉత్తర తెలంగాణలో పాగా వేసిన భాజపా భవిష్యత్‌లో గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగరవేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్​ పార్టీ కార్యాలయంలో వికారాబాద్​కు చెందిన వివిధ పార్టీల నాయకులు భాజపాలో చేరారు. సారు, కారు, పదహారు అన్న కేసీఆర్​కు పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతమొందించే సత్తా కమలం పార్టీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపాయేనని ప్రజలు భావిస్తున్నట్లు లక్ష్మణ్​ పేర్కొన్నారు.

కేసీఆర్​కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్న లక్ష్మణ్​

ABOUT THE AUTHOR

...view details