పంజాబ్‌లోని బటిండా నగరంలో దారుణం జరిగింది. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మంచి చెప్పిన భార్య ముక్కును కొరికేశాడు ఆమె భర్త అమన్‌దీప్ మిట్టల్. బాధిత మహిళ 'షీతల్'... స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటైన వీరు బతిండాలోనే కలిసి జీవిస్తున్నారు. అయితే, కొంతకాలంగా అమన్‌దీప్ మత్తుకు బానిసగా మారాడు. ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. షీతల్‌కు ఇది రెండో వివాహం కాగా అమన్‌దీప్‌కు మూడోది.
తాజాగా మత్తుపదార్థాలు సేవించి ఇంటికొచ్చిన భర్తతో గొడవపడ్డారు షీతల్. భార్య ప్రశ్నలతో కోపంతో ఊగిపోయిన అమన్‌దీప్ ఆమెపై భౌతిక దాడి చేశాడు. అదే క్రమంలో పంటితో భార్య ముక్కును కొరికేశాడు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.