తెలంగాణ

telangana

ETV Bharat / briefs

నాగేశ్వర్​రావుకు పగలే చుక్కలు చూపించిన సుప్రీం

కేంద్ర దర్యాప్తు సంస్థకు తాత్కాలిక డైరెక్టర్​గా పనిచేసిన నాగేశ్వరరావుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణపై లక్ష రూపాయల జరిమానా విధించింది.

నాగేశ్వర్​రావుకు పగలే చుక్కలు చూపించిన సుప్రీం

By

Published : Feb 12, 2019, 3:35 PM IST

కేంద్ర దర్యాప్తు సంస్థ మాజీ తాత్కాలిక డైరెక్టర్​ నాగేశ్వరరావుతో పాటు డైరెక్టర్​ ఆఫ్​ ప్రాసిక్యూషన్​ బసూరామ్​లను కోర్టు సమయం ముగిసేవరకు హాలులోనే ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతోపాటు చెరో రూ.1లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశించింది. బిహార్​లోని ముజఫర్​పూర్​ వసతిగృహం అత్యాచార ఘటనల కేసు దర్యాప్తు అధికారి బదిలీ విషయంలో కోర్టు ధిక్కరణకు పాల్పడటంపై ఇరువురికీ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.

ఈ కేసులో దర్యాప్తు అధికారిని తప్పించొద్దంటూ గతంలో అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ ఆ కేసును విచారిస్తోన్న సీబీఐ జాయింట్​ డైరెక్టర్​ ఏకే శర్మను బదిలీ చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో నాగేశ్వరరావు బేషరతు క్షమాపణలు చెప్పారు. ఈ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ కూడా కోర్టుకు విన్నవించారు. సుప్రీం ఈ అభ్యర్థనను తిరస్కరించింది.

ABOUT THE AUTHOR

...view details