దేశంలో ఎన్నో సంచలనాలకు నిలయంగా తెరాస పార్టీ నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా బొమ్మలరామారంలో ఎమ్మెల్యే గొంగిడి సునితతో కలిసి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి మొదలుపెట్టారు. అనంతరం మండలంలోని రైతుల విద్యుత్ సమస్య తీర్చేందుకు రామలింగంపల్లిలో సబ్‌స్టేషన్ ప్రారంభించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి ఈ సారి కూడా రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేయాలని కార్యకర్తలకు సూచించారు.
'ఎన్నో సంచలనాలకు నిలయం తెరాస పార్టీ' - అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నల్గొండ జిల్లా బొమ్మలరామారం మండలంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి కార్యకర్తలను పలు సూచనలు చేశారు.
MINISTER JAGADEESH REDDY STARTED DEVELOPMENT WORKS IN BOMMALARAMARAM
TAGGED:
అభివృద్ధి పనులకు శంకుస్థాపన