తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఆటోలో ప్రచారం చేసి.. గెలిచిన 'ఒడిశా మోదీ'

లోక్​సభ ఎన్నికల్లో ఒడిశాలోని బాలాసోర్​ ఎంపీగా విజయం సాధించిన భాజపా అభ్యర్థి ప్రతాప్​చంద్ర సారంగి.. 'ఒడిశా మోదీ'గా పేరుగాంచారు. నిరాడంబర జీవితం సాగిస్తూ ప్రజల మన్ననలు పొందిన సారంగి గురించి జీవన విధానం గురించి తెలుసుకోవాల్సిందే.

ఆటోలో ప్రచారం చేసి.. గెలిచిన 'ఒడిశా మోదీ'

By

Published : May 29, 2019, 11:58 PM IST

Updated : May 30, 2019, 9:58 AM IST

ఆటోలో ప్రచారం చేసి..

నిరాడంబర జీవనం, ప్రజాసేవే జీవిత లక్ష్యంగా ఉన్న ఓ వ్యక్తి లోక్​సభ ఎన్నికల్లో ఒడిశాలోని బాలాసోర్​ లోక్​సభ స్థానంలో ఘన విజయం సాధించారు. ఆయనే 'ఒడిశా మోదీ'గా పిలుచుకునే ప్రతాప్​ చంద్ర సారంగి. ఇప్పుడు ఆయన పేరు నెట్టింట వైరల్​గా మారింది.

ఆయనకి ఎలాంటి ఆస్తులు లేవు. చిన్న పూరింట్లో ఉంటారు. సైకిల్​పై విస్తృతంగా పర్యటిస్తుంటారు. చేతిపంపు వద్ద స్నానం చేస్తారు. కానీ కోటీశ్వరుడైన బీజేడీ అభ్యర్థి రవీంద్ర కుమార్​ జేనాపై 12,956 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఆటోలో తిరుగుతూ ప్రచారం

ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు అంటే.. వాహనాలు, చిన్న విమానాలు, హెలికాప్టర్లు ఉంటాయి. కానీ ఈ ఎన్నికల్లో సారంగి... ఆటోలో తిరుగూ ప్రచారం నిర్వహించారు.
ఒడిశాలోని నీలగిరి జిల్లా గోపీనాథ్​పుర్​లో జన్మించారు సారంగి. బాలాసోర్​లోని ఫక్రి మోహన్​ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. రామకృష్ణ మఠంలో సన్యాసిగా చేరాలనుకున్నారు. కానీ తమ ప్రాంతంలో సామాజిక సేవ చేయాలని అక్కడివారు ప్రోత్సహించారు. అక్కడి నుంచి ఇంటికి తిరిగివచ్చిన సారంగి ప్రజలకు సేవ చేయడం ప్రారంభించారు. మొదట నీలగిరి కళాళాలలో గుమస్తాగా చేరినప్పటికీ.. ఆర్​ఎస్​ఎస్​, వీహెచ్​పీలకు ఆకర్షితుడై ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. బాలాసోర్​, మయూర్భంజ్​లలోని గిరిజన ప్రాంతాల్లో ఎన్నో పాఠశాలలు ప్రారంభించారు సారంగి.

2004లో మొదటి సారి నీలగిరి నుంచి భాజపా టికెట్​పై శాసనసభకు ఎన్నికయ్యారు సారంగి. 2009లో అదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. 2014 లోక్​సభ ఎన్నికల్లో బాలాసోర్​ స్థానం నుంచి పోటీ చేసి బీజేడీ అభ్యర్థి రబింద్ర జేనాపై ఓటమి పాలయ్యారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో లోక్​సభ సభ్యుడిగా గెలిచారు.

ఇదీ చూడండి: కేంద్ర హోంమంత్రిగా అమిత్​షా..!

Last Updated : May 30, 2019, 9:58 AM IST

ABOUT THE AUTHOR

...view details