తెలంగాణ

telangana

ETV Bharat / briefs

2 దేశాలు..12 గంటలు..10 వికెట్లు

శ్రీలంక పేసర్ లసిత్ మలింగ.. కేవలం 12 గంటల వ్యవధిలో రెండు మ్యాచ్​లు ఆడాడు. ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​కు, శ్రీలంక దేశవాళీ టోర్నీలో గాలె జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఆటంటే ఎంతో ఇష్టమో నిరూపించాడు.

కొద్ది గంటల వ్యవధిలోనే రెండు మ్యాచ్​లాడి 10 వికెట్లు తీసిన మలింగ

By

Published : Apr 5, 2019, 11:59 AM IST

మలింగ.. క్రికెట్​ అభిమానులకు ఈ పేరు సుపరిచితమే. శ్రీలంక క్రికెటర్​గానే కాకుండా.. ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​ పేసర్​గా ఎన్నో ఘనతలు సాధించాడు. ఇప్పుడు కొద్ది సమయంలోనే రెండు మ్యాచ్​లాడి మరోసారి వార్తల్లో నిలిచాడు. రిటైర్మెంట్​కు దగ్గరపడుతున్న ఈ క్రికెటర్.. ఆటంటే​ ఎంత ఇష్టమో నిరూపించాడు.

బుధవారం..వాంఖడే స్టేడియంలోచెన్నైతో ఆడిన మ్యాచ్​లో ముంబయి తరఫున 3 వికెట్లు తీశాడు మలింగ. అనంతరం విమానమెక్కి శ్రీలంకలో జరుగుతున్న దేశవాళీ లీగ్​లో పాల్గొన్నాడు. గాలె తరఫున 7 వికెట్లు తీసి జట్టును గెలిపించాడు. కేవలం 12 గంటల వ్యవధిలోనే రెండు మ్యాచ్​ల్లో పాల్గొన్నాడీ బౌలర్.

ప్రపంచకప్​ జట్టులో ఉండాలంటే దేశవాళీ మ్యాచ్​లు ఆడాలనే నిబంధన విధించింది శ్రీలంక క్రికెట్ బోర్డు. ఈ కారణంగానే మలింగ రెండు మ్యాచ్​లు ఆడాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోను ట్వీట్ చేసిన ముంబయి ఇండియన్స్.. అతనిపై ప్రశంసలు కురిపించింది. జాతీయ జట్టుకు ఆడాల్సి రావడంతో.. ఐపీఎల్​ మధ్యలోనే వెనుదిరిగాడు లసిత్​ మలింగ.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details