భాజపా ఘన విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు ఇమ్రాన్.
"భాజపా కూటమి ఎన్నికల్లో విజయం సాధించినందుకు మోదీకి శుభాకాంక్షలు. దక్షిణ ఆసియాలో శాంతి, అభివృద్ధి, శ్రేయస్సు కోసం కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నా."
-ఇమ్రాన్ ఖాన్ ట్వీట్.
పుల్వామా ఘటన అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలహీనపడ్డాయి. భారత్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు పాకిస్థాన్‌కు కీలకంగా మారాయి. మోదీ మరోసారి అధికారంలోకి వస్తే ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు, కశ్మీర్ సమస్య పరిష్కారానికి మంచి అవకాశాలుంటాయని గత నెలలో ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: 'తీర్పును గౌరవిస్తున్నాం- కార్యకర్తలు అధైర్యపడొద్దు'