తెలంగాణ

telangana

ETV Bharat / briefs

వాటిని కూడా వాణిజ్య పన్నుల పరిధిలోకి తీసుకొస్తాం

గ్రేటర్​లోని ఇళ్లలో వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాటిని వాణిజ్య పన్నుల పరిధిలోకి తేవాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. నగరంలో ల‌క్ష రూపాయ‌లలోపు ఆస్తిప‌న్నును చెల్లించే నివాసాలపై ప్రత్యేకంగా స‌ర్వే చేపట్టనుంది.

జీహెచ్​ఎంసీ

By

Published : May 4, 2019, 6:17 AM IST

Updated : May 4, 2019, 7:43 AM IST

సాఫ్ హైద‌రాబాద్- షాన్‌దార్ హైద‌రాబాద్

జీహెచ్​ఎంసీ కార్యాలయంలో రెవెన్యూ అభివృద్ధి, సాఫ్ హైద‌రాబాద్- షాన్‌దార్ హైద‌రాబాద్ కార్యక్రమం నిర్వహ‌ణ‌, పౌర ఫిర్యాదుల ప‌రిష్కారం త‌దిత‌ర అంశాల‌పై జోన‌ల్‌, డిప్యూటీ క‌మిష‌న‌ర్లతో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ సమీక్ష స‌మావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 1200 రూపాయల నుంచి ల‌క్ష రూపాయ‌లలోపు ఆస్తిప‌న్ను చెల్లించే నివాసాలన్నింటిని ప్రత్యేకంగా స‌ర్వే నిర్వహిస్తామని క‌మిష‌న‌ర్ దాన‌కిశోర్ పేర్కొన్నారు.

ఇళ్లలో వ్యాపార కార్యక్రమాలు..

గ్రేట‌ర్‌లో దాదాపుగా 16 ల‌క్షల నివాసాలు ఉన్నాయ‌ని, వీటిలో 2.60 ల‌క్షల నివాసాలు 1,200 రూపాయల నుంచి ల‌క్ష మేర ఆస్తిప‌న్నును చెల్లిస్తున్నాయని తెలిపారు. వీటిలో అధిక శాతం ఇళ్లలో వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నార‌ని.. ఈ అంశంలో నివాసేత‌ర భ‌వ‌నాల‌న్నింటినీ.. వాణిజ్య పన్నుల ప‌రిధిలోకి తేవాల‌ని క‌మిష‌న‌ర్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ సిబ్బంది ఇంటింటికి తిరిగి ఆస్తుల ఫొటోలు తీసి వాటి వివ‌రాల‌ను సేక‌రిస్తార‌ని అన్నారు. స‌ర్వే పురోగ‌తిని ప్రతిరోజు జోన‌ల్‌, డిప్యూటీ కమిష‌న‌ర్లు స‌మీక్షించాల‌ని క‌మిష‌న‌ర్ ఆదేశించారు.

సమస్యల పరిష్కారం కోసం మై జీహెచ్​ఎంసీ

నగ‌రంలోని స‌మ‌స్యల ప‌రిష్కారానికి "మై జీహెచ్ఎంసీ" మొబైల్ యాప్ ద్వారా అందే ఫిర్యాదుల‌ను వెంట‌నే ప‌రిష్కరించాల‌ని క‌మిష‌న‌ర్ ఆదేశించారు. ఈ ఏడాది ఇప్పటి వ‌ర‌కు వివిధ అంశాల‌పై 67 వేల 793 ఫిర్యాదులు అంద‌గా వీటిలో 48 వేల 371 ప‌రిష్కరించారు. మ‌రో 13 వందల 61 పెండింగ్‌లో ఉన్నాయి. ఈనెల 12న న‌క్లెస్ రోడ్‌లో సాఫ్ హైద‌రాబాద్- షాన్‌దార్ హైద‌రాబాద్​పై చైత‌న్య ర్యాలీ, స‌ద‌స్సు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. వ్యక్తిగ‌త ఫిట్‌నెస్​కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో.. సిటీ ఫిట్‌నెస్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాల‌నే స్ఫూర్తితో ఈ చైత‌న్య స‌ద‌స్సు నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: మొదటి విడత ఎంసెట్​ ప్రశాంతం...

Last Updated : May 4, 2019, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details