కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 14 మంది రామాపురం వాసుల మృతదేహాలు స్వగ్రామానికి చేరాయి. ప్రమాదంలో మొత్తం 16 మంది మృతి చెందారు. 15 మంది జోగులాంబ గద్వాల జిల్లా వారు కాగా 14 మంది రామాపురం గ్రామ వాసులు.
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్షల అనంతరం 6 మృతదేహాలను రామాపురం తరలిస్తుండగా మార్గ మధ్యలో శాంతినగర్ వద్ద మహాప్రస్థానం వాహానాలను అడ్డుకున్నారు గ్రామస్థులు. బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించే వరకు మృతదేహాలను గ్రామంలోకి రానివ్వమని స్థానికులు ధర్నా చేపట్టారు.
'5లక్షల పరిహారం కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం'
ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గ్రామస్థులకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. బాధిత కుటుంబాలకు 20 లక్షల పరిహారం, 3 ఎకరాల భూమి, పిల్లలకు ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
శాంతినగర్ చేరుకున్న ఆర్డీవో రాములు, బాధిత కుటుంబాలకు 5లక్షల పరిహారం సహా ఇతర డిమాండ్‌లపైన ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని హామీ ఇచ్చారు.
ముగిసిన సామూహిక ఖననం
అంత్యక్రియల కోసం ప్రభుత్వం ప్రతీ బాధిత కుటుంబానికి పది వేల నగదును అందించింది. రామాపురం గ్రామంలో 14 మృతదేహాలకు సామూహిక ఖననం నిర్వహించగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, తెరాస ఎంపీ అభ్యర్థి రాములు, మాజీ ఎంపీ మంద జగన్నాథం, మాజీ మంత్రి డీకే అరుణ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
తక్షణమే 20 లక్షల పరిహారం ప్రకటించి వారిని ఆదుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. రహదారి భద్రత విషయంలో ఇకనైనా ప్రభుత్వాలు మేల్కొని కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ముగిసిన వెల్దుర్తి మృతుల సామూహిక ఖననం - GROUP FUNERAL ACTIVITIES COMPLETED
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను స్వగ్రామానికి తరలించారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన 14 మంది మృతుల సామూహిక ఖననం పూర్తైంది.
అంత్యక్రియలకు హాజరైన మందకృష్ణ మాదిగ
ఇవీ చూడండి : 'సార్వత్రికం' ఆరో దశ: లైవ్ అప్డేట్స్
Last Updated : May 12, 2019, 10:09 PM IST