తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఫ్రంట్​ను పరుగులు పెట్టిస్తున్న కేసీఆర్​

లోక్​సభ ఎన్నికల పర్వం పూర్తి కావొస్తున్నవేళ... మరోసారి ఫెడరల్​ ఫ్రంట్​ తెరపైకి వచ్చింది. ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, భావసారూప్య నేతలను కలిసిన కేసీఆర్​.. కేరళ సీఎం పినరయి విజయన్​తో భేటీ అయ్యారు. త్వరలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, నేతలను కలువబోతున్నారు. లోక్​సభ ఫలితాల వెల్లడిలోపే ఫ్రంట్ స్వరూప స్వభావాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా గులాబీ దళపతి అడుగులు వేస్తున్నారు. భాజపా, కాంగ్రెస్‌ పక్షాలకు మ్యాజిక్‌ ఫిగర్‌ రావడం కష్టమేనన్న విశ్లేషకుల అంచనాల నేపథ్యంలో కేసీఆర్‌ అడుగులు ఆసక్తి రేపుతున్నాయి.

ఫ్రంట్​ను పరుగులు పెట్టిస్తున్న కేసీఆర్​

By

Published : May 8, 2019, 5:32 AM IST

Updated : May 8, 2019, 8:16 AM IST

తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి.. విపక్షాలను కోలుకోలేని దెబ్బతీసిన గులాబీ దళపతి.. తాజాగా దిల్లీ పీఠం దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంట్​ ఎన్నికల ప్రచారంలో భాజపా, కాంగ్రెస్​లు నిమగ్నమవగా... కేసీఆర్​ మాత్రం ఫెడరల్​ ఫ్రంట్​ బలోపేతం దిశగా ముందుకు సాగుతున్నారు. అన్నీ కలిసి వస్తే తదుపరి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఫెడరల్‌ ఫ్రంట్‌ నిర్ణయాత్మక పాత్ర పోషించే సూచనలు కనిపిస్తున్నాయి.

స్పష్టమైన లెక్కలతో..

ఇప్పటి వరకు పార్లమెంట్​ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో జాతీయ పార్టీల గెలుపోటములపై స్పష్టమైన లెక్కలు వేసిన కేసీఆర్‌... కేంద్ర రాజకీయాల్లో తెలంగాణ ముద్ర ఉండేందుకు అవసరమైన కార్యచరణను ప్రారంభించారు. ఎన్నికలు పూర్తైన రాష్ట్రాల్లోని ముఖ్యనేతలతో చరవాణి ద్వారా సంప్రదింపులు జరిపి సమాచారం సేకరించారు. యూపీఏ, ఎన్​డీఏ కూటమిలకు దూరంగా ఉన్న కమ్యూనిస్టులు, ఇతర విపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయి. ఎవరెవర్నీ కలిస్తే తమకు లాభం చేకూరుతుందనే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు.

దిల్లీ గద్దెపై పట్టుకోసం..

దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుట్టిన కేసీఆర్​ మెుదటగా కమ్యూనిస్టుల కంచుకోట అయిన కేరళకు వెళ్లారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్​తో ఏకాంతంగా చర్చలు జరిపారు. ఫెడరల్​ ఫ్రంట్​కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా కమ్యూనిస్టులు కలిసి రావాలని కోరారు. గత పాలకులైన భాజపా, కాంగ్రెస్​ వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని.. ఇప్పటికి దేశంలో కరెంటు, నీళ్లు లేని పల్లెలు ఉన్నాయంటే అది గత పాలకుల పాపమే అని కేసీఆర్​ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఇప్పటికే మమతా బెనర్జీ, దేవెగౌడ, కుమారస్వామి, నవీన్​ పట్నాయక్​ లాంటి సీనియర్​ నేతలను కేసీఆర్​ స్వయంగా కలిశారు. వైకాపా అధినేత జగన్​తో కేసీఆర్​ తనయుడు కేటీఆర్​ సైతం చర్చలు జరిపిన విషయం తెలిసిందే. పార్లమెంట్​ ఎన్నికల ఫలితాలలోపే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరిపి..కలిసి వచ్చే వారందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చి... దిల్లీ గద్దెపై ప్రాంతీయ పార్టీల సత్తా చాటేందుకు గులాబీ దళపతి సమాయత్తమవుతున్నారు.

గులాబీ దళపతి అడుగులు

ఇవీ చూడండి:సీఎం కేసీఆర్​ - స్టాలిన్​ భేటీపై ఉత్కంఠ

Last Updated : May 8, 2019, 8:16 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details